6 దేశాల్లో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు

ప్రపంచంలో కరోనా మహామ్మారి చైనా నుంచి విశ్వమంతా పాకింది. ఐతే చైనీయులు మాత్రం కరోనాను కట్టడి చేస్తూ ముందుకెళ్తున్నారు. కానీ ప్రపంచంలోనే అత్యాధునిక దేశాలైన అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ లాగే బ్రిటన్ ఈ 5 దేశాలు కరోనా మహామ్మారి విజృంభన కారణంగా అతలకుతాల మయ్యాయి, అవుతూనే ఉన్నాయి, శుభం కార్డు ఎప్పుడనేది మాత్రం నేటికి అర్థం కావడం లేదు.

విశ్వంలోనే పెద్దన్న, అగ్ర రాజ్యం, అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోన్న USA ప్రస్తుత పరిస్థితి భయానకంగా ఉంది. కరోనా సోకిన కేసులు, మరణాల్లో తొలి స్థానం అమెరికాదే. ఏప్రిల్ 16 నాటికి 6,44, 348 మంది కోవిడ్-19 భాదితులు నమోదవ్వగా, 28,554 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమైనది.

యూరప్ ఖండంలోనే ప్రసిద్ధి చెందిన ఇటలీ రెండో స్థానంలో ఉంది. ఘోరం ఏంటంటే చైనీయులను ఆదుకోవాలని అనుకున్న దేశమే కరోనా కోరల్లో చిక్కడంతో వైరస్ 1,65,155 మందికి సోకగా 21,645 జనాభా చనిపోయారు. వైరస్ సోకడంతో మూడో స్థానంలో ఉండగా మృతుల్లో 2వ స్థానంలో కొట్టుమిట్టాడుతోంది.

అదే ఐరోపా ఖండంలో యువత కలలు సాకారం చేసుకునే ఇష్టమైన స్పెయిన్ దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. కోవిడ్-19 సోకిన వ్యక్తులు 1,80,659 (కేసుల్లో రెండో స్థానం) నమోదవ్వగా 18,812 (మృతుల్లో మూడో స్థానం) మృతి చెందారు.

ప్రపంచ ఫ్యాషన్ సామ్రాజ్యాన్ని ఒంటి చేత్తో ఏలే ఏకైక దేశం ఫ్రాన్స్ కరోనా మహామ్మారితో చిన్నాభిన్నమ వుతోంది. కరోనా కేసుల్లో 1,47,863, మృతులు 17,167 సంఖ్యతో నాలుగో స్థానంలో వణికిపోతోంది.

రవి అస్తమించని సామ్రాజ్యం ది గ్రేట్ బ్రిటన్ మృతుల్లో 12,868 (మృతులు 5వ స్థానం) మందితో చచ్చి బతుకుతోంది. కరోనా సోకడంతో (కేసులు 6వ స్థానం) 98,476 కేసులున్నాయి.

జర్మనీ ఒకప్పుడు హిట్లర్ గడగడలాడించిన దేశం ఇప్పుడు కరోనాతో గజగజలాడుతోంది. కరోనా మహామ్మారి కేసులు (కేసులు 5వ స్థానం) 1,34,753 నమోదవ్వగా మృతులు (మృతులు 6వ స్థానం) 3,804గా అధికారిక రికార్డుల్లో మనకు అందుతోన్న సమాచారం.

అసలు చైనాలో కరోనా లెక్కలు చూస్తే వైరస్ సోకిన వ్యక్తులు 82,341మంది ఉండగా మృతులు 3,342గా సంఖ్య నమోదైంది.

2020 కరోనా కాటుతో కకావికాలం అవుతోన్న సంవత్సరం, అలాగే మార్చి, ఏప్రిల్ నెలలు కరోనా మహామ్మారి విజృంభన శాఖంగా చరిత్రలోకి ఎక్కేసాయి. కానీ ఎప్పుడూ శుభం కార్డు పడుతుందానేదే తెలియక భారతీయులతో పాటు ప్రపంచంలోని ప్రతి మనిషి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.