కరోనా వైరస్ గుర్తించే లక్షణాలు. మీకోసం

కరోనా వరస గుర్తించే లక్షణాలు. మీకోసం

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న
కరోనా వైరస్ లక్షణాలను ఎలా గుర్తించాలి? అసలు కరోనా వైరస్ ఎలా సంక్రమిస్తుంది? పూర్తి వివరాలు కింద చదవండి.

కరోనా వైరస్ సాధారణంగానే ఉండటమే కాకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, దగ్గు రావడం, జలుబుతో ముక్కు కారడం లాంటి ప్రాథమిక లక్షణాలు ఉంటాయి.
కరోనా కుటుంబానికే చెందిన సార్స్, మర్స్ లాంటి
(మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వైరస్‌లు మాత్రం
అత్యంత ప్రమాదకరమైనవి. చైనాలోని ఊహాన్ నగరం
నుంచి వ్యాపించిన వైరస్‌ కొత్త జాతి వైరస్. ఇంతవరకు మనుషుల్లో గుర్తించలేదు. కరోనా వైరస్ సోకడమనేది ప్రాధమికంగా జ్వరంతో ప్రారంభమవుతుంది. ఆపై పొడి
దగ్గు తీవ్రంగా వస్తుంది. ఈ లక్షణాలు అలాగే కొనసాగితే,
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తప్పవు. తీవ్రత ఎక్కువగా ఉండే కేసుల్లో ఇన్ఫెక్షన్ న్యుమోనియా లేదా సార్స్‌గా మారుతుంది. కిడ్నీలు ఫెయిలై రోగి చనిపోయే ప్రమాదం.
కరోనా రోగుల్లో ఎక్కువగా వృద్ధులే ఉన్నారు. ముఖ్యంగా పార్కిన్సన్, డయాబెటిస్ లాంటి వ్యాధులు ఉన్నవారు ఈ మహామ్మారి బారిన పడుతున్నారు. ఈ వైరస్ నుంచి తప్పించుకునేందుకు నేటివరకు ఎలాంటి ప్రత్యేక చికిత్సలు అందుబాటులో లేవు. సాధారణంగా ఈ కరోనా సోకినప్పటి నుంచి వ్యాధి బయట పడానికి సుమారు 14 రోజుల సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రపంచంలోని సుప్రసిద్ధ పరిశోధకులు మాత్రం 24 రోజుల వరకు సమయం తీసుకుతుందంటున్నారు.

కరోనా సోకకుండా జాగ్రత్తలు.
కరోనావైరస్ ప్రభావిత ప్రాంతాల్లో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలి లేదంటే ప్రమాదం తప్పదని ప్రపంచ ఆరోగ్య
సంస్థ హెచ్చరించింది. ప్రతి రెండు గంటలకు ఓసారి ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రపరచుకోవాలి. దగ్గు, జలుబుతో బాధపడుతుండే వ్యక్తులకు సామాజిక స్పృహతో 1 మీటరు నుంచి 3 మీటర్ల దూరంలో ఉండాలి. దగ్గు, జలుబు లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులు బట్టను అడ్డం పెట్టుకోవడం, ఎదుటి వ్యక్తులపై పడకుండా జాగ్రత్త పడాలి. రోడ్డుపై, ప్రయాణాల్లో, షాపింగ్ సమయాల్లో, ఆఫీసుల్లో అవసరమైన ప్రతి వస్తువును చేతితో తాకుతునే ఉంటాం. ఆ సమయంలో వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ చేతులతో కళ్లను నలిపినా, ముక్కును, నోటిని తాకినా ఆ వైరస్ శరీరంలోకి ప్రవేశించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు చేతులు కడగాలి అంతే కాకుండా చేతులతో కళ్లను, నోటిని, ముక్కును తాకకుండా ఉండటం జాగ్రత్తల్లో భాగంగా పాటించాలి. కరోనా వైరస్ సోకిన వ్యక్తులు కూడా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి, పెంపుడు జంతువులు, లేదా ఇతర జంతువులకు దూరంగా ఉండాలి. పచ్చిగా ఉన్నవి లేదా సగం ఉడికిన మాంసం, గుడ్లు తినకూడదు. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం దగ్గర్లో ఉన్న ప్రభుత్వాసుపత్రికి వెళ్లి తగిన పరీక్షలు చేయించుకోవాలి.