కొవిడ్-19 పుట్టింది చైనా…
పాకుతోంది గ్లోబులోన్న ఏదేశానికైనా..
ప్రపంచాన్ని వనికిస్తుంది ఈ మహమ్మారి కరోనా…
జలుబు, జ్వరం, దగ్గుతో అవుతున్నారు జనం హైరానా….
ప్రతి మనిషి ఇంట్లోనే చెయ్యాలి ఖాన,పీనా…
బయటికొస్తే పోలీసులు వేస్తారు భారి జరిమానా…
ఇంట్లో పిల్లలు మోగిస్తున్నారు అల్లరి వీణా….
ఉరెల్లి పోదమంటే ఆపినారు సర్కారు రవాణా…
కొన్నాళ్లు వెల్లవద్దు షాదీఖానా…
గుంపు గూడితె వస్తుంది సైతాను కరోనా…
భౌతిక దూరం చూసుకో మూడడుగులు నేలపైనా…
కొవిడ్ సోకి పోవద్ధు ఆరడుగుల భూమిలోనా…
హోమ్ క్వరన్టైన్కి ఖర్చు కాదు ఏక్- అణా…
అనుసరించాలి అందరు స్వీయ నియంత్రణా…
పరిశుభ్రమైన ఇల్లు మనకు ఇవ్వనుంది రక్షణా…
టీవి చూస్తు పొందాలి కరోనా నియంత్రణ శిక్షణా….
షేక్ -హ్యాండ్, హలయ్-బలయ్ అస్సలే వద్దన్నా…
రుమాల్లు, మాస్కులు పెట్టుకోవడం ముద్దన్నా…
జనాన్ని అవగాహన చేస్తున్న నీకు వందనం విలేకరన్నా….
రోగులను చూస్తున్న డాక్టర్ దైవంతో సమానమన్నా…
ఏక్కిస్ దిన్ ఘర్మే సిర్ఫ్ ఫ్యామిలిసే రహేనా…
మర్నేకేలియే బస్తిమే బహర్ నహీ ఆనా…
కుచ్ ప్రాబ్లం రహేతో 104కో డయల్ కర్నా…
పోలీస్ వాల ఆకె లేజాయేన్ గ ఆప్కొ దవఖానా…
ఘడి, ఘడికో శనిటైజర్సే హ్యాండ్ వాష్ కర్నా…
కపడోన్కో, ఘరోన్కో ప్రతిదిన్ క్లీన్ కర్నా…
ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్ అబ్ నహీ ఖాన, పీనా…
లేమన్ వాటర్, అల్లం ఛాయ్ కంట్రోల్ చేయును కరోనా…
బాయి, బహెనో కరోనాకె బారిమే ధ్యాన్ సే సోచునా…
సబ్ లోఘ్ మిల్కె భారత్ కో బచానా..
…………………✍
*రచనా – మర్పల్లి అశోక్*
ప్రైమరీ స్కూల్ టీచర్, మరియు సామజిక కార్యకర్త,
శంకర్పల్లి మండల్, రంగారెడ్డి జిల్లా. తెలంగాణ.
???????????????