కరోనా వ్యాక్సిన్లు మీ కోసమే..కేంద్ర ఆరోగ్య మంత్రి

కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార్నిశలు శ్రమిస్తున్నాయి. కానీ మనదేశంలో కరోనా కేసుల సంఖ్య నమోదు మాత్రం నిలబడటం లేదు. అందుకే భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌కు తగ్గ‌ట్టుగా వైద్య సామగ్రి ఆర్డ‌ర్ చేసిన‌ట్టు కేంద్రం వెల్లడించింది. కోవిడ్-19కు పూర్తిస్థాయి చికిత్స కేంద్రంగా ఎయిమ్స్ జాజ్జ‌ర్ ఆసుపత్రిలో చేయబోతున్నారు. భ‌యంక‌ర‌మైన కోవిడ్‌-19 వైర‌స్ క‌ట్ట‌డికి వ్యాక్సిన్ కనుగొనడానికి ప్రపంచ వ్యాప్తంగా శాస్ర్త‌వేత్త‌లు పగలు, రాత్రి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నార‌ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హ‌ర్ష‌వ‌ర్థ‌న్ అన్నారు. అయితే వ్యాక్సిన్ వ‌చ్చేంత వ‌ర‌కు లాక్‌డౌన్‌ మరియు సామాజిక దూరం కలయికల‌ను కోవిడ్‌-19కు వ్యతిరేకంగా సమర్థవంతమైన సామాజిక వ్యాక్సిన్‌గా ప్ర‌జ‌లు పరిగణించాలని ఆయ‌న సూచించారు.

కోవిడ్-19కు పూర్తిస్థాయి చికిత్స అందిస్తున్న‌ ఎయిమ్స్ జాజ్జ‌ర్ ఆసుపత్రిలో వైద్య సేవలు సంసిద్ధ‌త ఏర్పాట్లను తెలుసుకొనేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హ‌ర్ష‌వ‌ర్థ‌న్ ఆదివారం ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ను సందర్శించారు. ఇక‌పై ఎయిమ్స్ జాజ్జ‌ర్ ఆసుపత్రి కోవిడ్‌-19 వైర‌స్ చికిత్స‌కు పూర్తిస్థాయి ఆసుప్ర‌తిగా ప‌ని చేస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. జాజ్జ‌ర్లో కోవిడ్‌-19 చికిత్స‌ కోసం 300 పడ‌క‌ల‌తో కూడిన ఐసోలేష‌న్ వార్డుల‌ను అధునాత వైద్య స‌దుపాయాల‌తో అందుబాటులోకి తెచ్చిన‌ట్టు ఆయ‌న వివ‌రించారు. త‌న స‌మీక్ష సంద‌ర్శ‌న‌లో భాగంగా ఐసోలేష‌న్ స‌దుపాయం ఉన్న అత్యాధునిక భ‌వ‌నంలోని వివిధ సౌక‌ర్యాల‌ను గురించి వాక‌బు చేశారు. దీనికి తోడు విశ్రామ్ సదన్, వైద్యులు మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది నివాస గృహాల స‌ముదాయాన్ని ఆయ‌న సంద‌ర్శించారు.

ఈ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హ‌ర్ష‌వ‌ర్థ‌న్ కోవిడ్‌-19 సోకిన రోగుల‌తో వీడియోకాల్లో ముచ్చ‌టించారు. వారి బాగోగుల‌ను గురించి అడిగి తెలుసుకున్నారు. అందుతున్న చికిత్స వివ‌రాల‌ను కూడా తెలుసుకున్నారు. జాజ్జ‌ర్ కేంద్రంలో కోవిడ్-19 రోగుల నిమిత్తం అందుతున్న సేవ‌ల‌ను గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఇత‌ర సౌక‌ర్యాలు ఏమైనా కావాలా అని కూడా మంత్రి వారిని వాక‌బు చేశారు. వారి స‌ల‌హ‌ల‌తో కేంద్రంలో సేవ‌ల‌ను మ‌రింత‌గా అభివృద్ధి ప‌రిచేందుకు వీలుపుడుతుంద‌ని మంత్రి తెలిపారు.

 

దేశం అత్యంత క‌ఠిన‌మైన పరీక్ష సమయంలో ఉన్న‌ప్పుడు మన ఆరోగ్యయోధులు వైద్యులు నిజాయితీగా ధైర్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ త‌గిన‌ సేవ‌లనందించ‌డాన్ని ఆయ‌న హృద‌య పూర్వ‌కంగా అభినందించారు. వైద్య చికిత్స‌ల‌కు అవ‌రోధం క‌ల్పిస్తే క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయని హెచ్చరించారు. క‌రోనా వైర‌స్ బాధితుల‌కు చికిత్సనందిస్తున్న స‌మ‌యంలో రోగుల బంధువులు వైద్యులు మరియు ఆరోగ్య కార్యకర్తల విధుల‌ను అడ్డ‌కోవ‌డం ప‌ట్ల మంత్రి విస్మ‌యం వ్య‌క్తం చేశారు. ఇలాంటి సంఘటనలు కేంద్రం హోం మంత్రిత్వ శాఖ దృష్టికి వ‌చ్చాయ‌ని ఆయ‌న అన్నారు. జాతీయ భద్రతా చట్టం ప్రకారం ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయ‌న అధికారులకు సూచించారు. ప్ర‌స్తుత సంక్షోభ స‌మ‌యంలో మ‌న వైద్యులు మరియు ఆరోగ్య యోధులు భయం లేకుండా పనిచేయాల్సి ఉంటుంద‌ని మంత్రి అభిప్రాయ‌ప‌డ్డారు. ఇందుకు స‌ర్కారు వైద్య సిబ్బందికి అండ‌గా నిలుస్తుంద‌ని తెలిపారు.

కరోనా మహామ్మారి సోకరాదంటే లాక్‌డౌన్‌, సామాజిక దూరాలే కోవిడ్‌-19కు మేటి సాటిలేని సామాజిక వ్యాక్సిన్ మాత్రమేనని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హ‌ర్ష‌వ‌ర్థ‌న్ అన్నారు.