కరోనాకు వెంటిలేటర్లు 50వేలు-జనాభా 125కోట్లు తస్మాత్ జాగ్రత్త.

కరోనాకు వెంటిలేటర్లు 50వేలు-జనాభా 125కోట్లు తస్మాత్ జాగ్రత్త.


మన భారతరదేశంలో కరోనా సోకితో కట్టడికి కనీసం ఆస్పత్రుల సౌకర్యాలు కరువవుతాయి. కనీసం వైద్య సేవలు, వైద్యులు, వైద్య సిబ్బంది కూడా అందుబాటులోకి రావడం అరకోరే.
ఇప్పటికే ఢిల్లీ దేశ రాజధానిలో కరోనాకు చికిత్స అందిస్తోన్న డాక్టర్లను ఇల్లు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారు. నేటికి వైద్యులు సాహసోపేతంగా చేస్తోన్న సేవలు శభాష్. కానీ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నియమనిబంధనలు నిర్లక్ష్యం చేస్తే
తీవ్ర సంక్షోభం తప్పదు. ఓ నివేదిక ప్రకారం మన దేశంలో కరోనా కోసం వైద్య సదుపాయాలు కల్పన విషయంలో సర్వే చేయగా దేశమంతటా కేవలం 50వేల వెంటిలేటర్లు మాత్రమే ఉన్నట్టు తేలింది కానీ మనదేశ జనాభా 125కోట్లకు పైగానే ఉంటుంది. నిర్లక్ష్యం వహించి నిబంధనలు పాటించకపోతే దాదాపుగా 25 లక్షల మంది ఆస్పత్రుల్లో చేరాల్సిన దుస్థితి వచ్చే పెను ప్రమాదం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హెచ్చరికలు దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలి. వైరస్‌ సామర్థ్యం తగ్గితే భగవంతుడి దయ లేదంటే ఇప్పటికిప్పుడు మనకు అత్యవసరంగా 10 లక్షల వెంటిలేటర్ల అవసరం పడతాయని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అందుకే భారతీయుల్లారా మనమంతా ఐక్యంతో నినదిద్దాం పోరాడుదాం ఇంటికే పరిమితం అవుదాం. మనల్ని, సమాజాన్ని, దేశాన్ని మొత్తం మానవాళిని కాపాడుదాం. ప్రపంచానికి ఆదర్శంగా నిలబడుదాం.