గూగుల్ అంతర్జాలంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు, మృతుల వివరాల కోసం ఎక్కడ పడితే అక్కడ తప్పుడు సమాచారం మాత్రమే కాదు సైబర్ నేరగాళ్ల వైరస్ కూడా వస్తుందని కర్నూలు పోలీసులు హెచ్చరించారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు, క్రిమినల్ కేసులు, అరెస్టులు తప్పవని కర్నూలు జిల్లా ఫక్కీరప్పవెల్లడించారు. కర్నూల్ సంజామాలలో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసిన ఇద్దరు అనుమానస్పద వ్యక్తులపై కేసులు కూడా నమోదు చేశారు. మార్చి23 నుంచే మొత్తం 6,793 కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ Dr. ఫక్కీరప్ప శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కేసుల వివరాల్లోకి వెళ్తే 6,516 MV యాక్టు కేసులు, 277 ఐపిసి (ఐపిసి సెక్షన్లు 188, 269, 270) కేసులు నమోదు చేశామన్నారు. అంతర్జాలంలో ఫేక్ కరోనా వెబ్సైట్లు పుట్టుకొస్తున్నాయని ఆ విషయాన్ని సైబర్ క్రైం పోలీస్లు గుర్తించారని పేర్కొన్నారు. అందులో
1.coronavirursstatus(.)space, 2. coro navirus(.)zone, 3. coronavir s-realtime(.com)
4. bgvfr.coro navirusaware(.)xyz ఇవి చాలా డేంజరస్ డొమైన్స్ ఈ సైటులపై ఏమాత్రం క్లిక్ చేయవద్దని ఏవైనా సందేహాలు ఉంటే సైబర్ ల్యాబ్ పోలీస్లు, సైబర్ మిత్ర వాట్సాప్ నెంబర్ 9121211100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.