ప్రవేటు హాస్పిటల్స్, డాక్టర్లు మీరెక్కడ?

కరోనా నిర్మూలనలో “ప్రవేటు హాస్పిటల్స్” భాగస్వామ్యమేది?
ఆరోగ్యశ్రీ నిధులు తీసుకునే ఆసుపత్రులు ఏమయ్యాయి?
వైద్యంలో నెంబర్1 స్థానాల్లోన్న డాక్టర్లు ఎటుపోయారు?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కరోనా వైరస్ వ్యాపించిన నాటి నుండి ప్రైవేట్ హాస్పటల్స్ ఏమి చేస్తున్నాయి? కేవలం ప్రభుత్వ వైద్య సిబ్బంది మాత్రమే సేవ చేయాలా? మన ఉభయ రాష్ట్రాల్లో ఉన్న ప్రవేటు ఆసుపత్రి వ్యవస్థ నిద్రపోతుందా?
ఆరోగ్యశ్రీ ఆర్థిక సహాయాన్ని ఉపయోగించే హాస్పిటల్స్
ఏం చేస్తున్నాయి? మేమే నెంబర్1 అని టీవీలు, హోర్డింగ్లు, పత్రికలలో ప్రకటనలు ఇచ్చే ఆసుపత్రులు, వాటి ఎంట్రన్స్
లకు ఎందుకు రెడ్ రిబ్బెన్ తగిలించాయి? అమాయకులు, సామాన్య జనం నుంచి కోట్ల రూపాయలు దండుకుంటున్న
ఈ ప్రవేటు ఆసుపత్రులు, ఎందుకు సామాజిక స్పృహ కోల్పోయి, సామాజిక బాధ్యతను మరచి పోయాయి?
నేడు దేశం అత్యంత ప్రమాదకరమైన వైరస్ బారిన పడి, క్లిష్ట పరిస్థితిలో ఉంటే, ప్రభుత్వ వైద్య రంగానికి కనీసం సాయం చేయాలనే సోయి లేదా? ఈ బడా ప్రవేటు ఆసుపత్రులకు ఏమైంది మీ మానవత్వం??ధనార్జనే మీ లక్ష్యమా? మనిషి ప్రాణాలకు విలువ ఇవ్వడం మీకు తెలియదా?

నేడు దేశం మరియు రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధన విధించిన మాదిరిగా ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రైవేటు ఆసుపత్రులను కూడా COVID-19 నియంత్రణ విధి నిర్వహణలో భాగస్వాములుగా చేస్తూ కఠినమైన ఉత్తర్వులు తక్షణమే జారీ చేయాలని జనం కోరుకుంటున్నారు. ప్రవేటు ఆసుపత్రి యాజమాన్యాలు దయచేసి ఇప్పటికైనా కళ్లు తెరిచి, మేమున్నామంటూ సామాన్యులకు సైతం ధైర్యం కల్పించి
విధి నిర్వహణలో భాగస్వాములు కావాలి. మహమ్మారి వైరస్ తరిమికొట్టేందుకు ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించండి.

ప్రజలారా ప్రైవేటు వైద్య సిబ్బందిని ప్రశ్నించండి?? వైద్య విధి నిర్వహణలో వారిని భాగస్వాములు చేయండి. మనకోసం మన మందరము, మనల్ని మనం, మన సమాజాన్ని, దేశాన్ని కాపాడుకుందాం. యువతా, కోలుకో, మేలుకో, ఈ దేశాన్ని ఏలుకో..మీ అభిప్రాయాలు అందరూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి.