కరోనాపై ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

కరోనాపై ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

ఇంట్లో ఉన్నాము కదా.. కరోనా వైరస్ రాదనుకుంటే నిజంగా పొరపాటే. ఇంకా చెప్పాలంటే.. బయటివాళ్లకంటే.. ఇంట్లో ఉన్నవారికే వైరస్ ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. సరైన జాగ్రత్తలు పాటించకుంటే కుటుంబం మొత్తం ఈ వైరస్ బారిన పడే ఛాన్స్ ఉంది. స్వీయ నిర్భంద కాలంలో మీరు పాటించాల్సిన సూచనలేంటో మీరే తెలుసుకోండి.

నాలుగు గోడల మధ్య ఉన్నాము కదా.. ఎలాంటి వైరస్ దరి చేరదనుకుంటే పొరపాటే. పాల ప్యాకెట్లు, న్యూస్ పేపర్, ఇతరత్రా సరుకుల ద్వారా కూడా వైరస్ మనకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ కింది వివరాలను చదివి అమలు చేయండి. మీతో పాటు మీ కుటుంబాన్నీ కాపాడుకోండి.

1. బయట నుంచి తీసుకొచ్చిన వస్తువులను డైరెక్ట్‌గా తాకకుండా చేతులకు శానిటైజర్ రాసుకుని పట్టుకోవాలి.
2. అలాగే పాల ప్యాకెట్లను, కూరగాయలను, ఫ్రూట్స్‌ని శుభ్రంగా కడిగి, చేతులను కూడా వాష్ చేసుకోవాలి.
3. ప్రస్తుతం కరోనా ప్రబలుతున్న తరుణంలో న్యూస్ పేపర్స్‌ని రద్దు చేయడం మంచింది.
4. కొరియర్స్, ఇతరత్రా వాటి కోసం ఇంటి బయట
ఓ బ్లాకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోండి.
5. పని మనుషులకు కూడా నిర్భంద కాలం తప్పదు.
6. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీస్‌ లేకుండా రద్దు చేయండి.
7. మొబైల్ ఫోన్లు, రిమోట్ కంట్రోల్, కీ బోర్డ్స్ తరుచూ శుభ్రం చేసుకోవాలి.
8. అత్యవసరంగా బయటకు వెళ్లి వస్తే వెంటనే స్నానం చేయాలి.
9. వృద్ధులు ఈ కాలంలో వాకింగ్‌లకు వెళ్లకపోవడమే మంచిది.
10. ఎప్పటికి అప్పుడు ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు, సూచనలు పాటించాలి.