MEIL సంస్థ కరోనా కట్టడికి 5కోట్ల విరాళం. 

MEIL కరోనా కట్టడికి 5కోట్ల విరాళం.

ప్రపంచం కరోనా వైరస్ పై యుద్ధం చేస్తోంది. ఈ మహామ్మారి మన దేశ వ్యాప్తంగా వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించి అత్యవసర సేవలు మాత్రమే కొనసాగిస్తామని ఆదేశించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో
దేశంలోనే ప్రముఖ మౌళిక రంగ నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ కరోనా మాహామ్మారిని అడ్డుకునేందుకు తన వంతు భాగస్వామ్యాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అందించింది. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి తనవంతు 5 కోట్ల
రూపాయలను విరాళాన్ని అందించింది. ఈ సందర్భంగా కరోనా మహమ్మారి కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మేఘా సంస్థ ప్రశంసించింది.

ముఖ్యమంత్రి అలాగే ప్రభుత్వ యంత్రాంగం శక్తీ సామర్ధ్యాలపై ప్రజలు పెట్టుకున్న విశ్వాసాన్ని MEIL యాజమాన్యం అభినందించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు మేఘా ఇంజనీరింగ్ MD PV కృష్ణా రెడ్డి 5 కోట్ల రూపాయలకు చెక్కును అందజేశారు.
అలాగే ఈ అత్యవసర పరిస్థితుల్లో రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేదలకు, అలాగే కరోనాపై యుద్ధం చేస్తోన్న వైద్యులు, పోలీసులు, మీడియా, సానిటేషన్ సిబ్బందికి తమ వంతు సాయం అందించాలని ప్రముఖ నిర్మాణ సంస్థ MEIL నిర్ణయించింది.