ఇటలీలో కరోనా మృత్యుంజయుడు

యూరప్ ఖండంలోని ఇటలీలో అద్భుతం చోటుచేసు​కుంది. ప్రాణాంతకమైన కరోనా వైరస్ సోకిన 101 ఏళ్ల వయో వృద్ధుడు
కోవిడ్-19ను అధిగమించి కోలుకున్నారు. ఈ అద్భుతం అందరిని ఆశ్చర్యంలో ముంచేసింది. ఇటలీ రిమిని నగర డిప్యూటీ మేయర్‌ గ్లోరియా లిజి అందిస్తోన్న సమాచారం ప్రకారం 101 ఏళ్ల ‘మిస్టర్‌పి’ అనే వృద్ధుడికి వైరస్‌ సోకడంతో ఆస్పత్రిలో చేరారు. 1919లో జన్మించిన అతను కరోనా కొరల్లో చిక్కుకున్నప్పటికి కోలుకున్నారని వెళ్ళడించారు. బుధవారం ఆస్పత్రి నుంచి మృత్యుంజయుడిని డిశ్చార్జి చేసారు. ఇటలీలో ఓవైపు ఇప్పటి వరకు కరోనాతో 80589మంది ఇబ్బందులు పడుతుంటే 8215 మంది ప్రాణాలు కోల్పోయారు.