కరోనా సంక్షోభం ఓ గుణపాఠం. ఎందుకంటే WHO మాటల్లో?

కరోనా సంక్షోభం ఓ గుణపాఠం. ఎందుకంటే WHO మాటల్లో?Newsbazar9.com ప్రత్యేకంగా మీ కోసం..

ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ కారణంగా ఎదురవుతోన్న సవాళ్లు నాటకీయంగా పరిస్థితులు, పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడంలో నా కుంటుంభం కూడా అతీతులు కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రస్ అదానం గేబ్రియాసస్ ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర విపత్కర పరిస్థితులు కారణంగాస్కూళ్లు మూసివేయడంతో నా కూతురు ఇంట్లోనే ఉంటూ ఆన్ లైనులో విద్యను అభ్యసిస్తోంది. ప్రపంచ దేశాలన్నీ ఈ కరోనా మహామ్మారి కారణంగా ఎదురవుతోన్న సవాళ్లను నమ్మకంతో అధిగమించాలి. ఈ విపత్కర పరిస్థితుల్లో శారీరక, మానసీక దృఢత్వంతో ఉండాలని సలహాలు, సూచనలు చేశారు.

1. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలి.
2. ఆల్కహాల్, శీతల పానీయాలు తీసుకోవడం మానాలి.
3. ధూమపానం చేయరాదు. కోవిడ్19 సోకితే మీరు అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
4. శారీరక దృఢత్వం కోసం వ్యాయామం తప్పనిసరి. ప్రతి రోజు పెద్దలు 30నిమిషాలు పిల్లలు ఓ గంటపాటు వ్యాయామం చేయాలి.
4A. మీ దేశంలో అమలు చేస్తోన్న నియమ నిబంధనలు, ఆదేశాలు తప్పకుండా పాటించండి.
4B. సామాజిక దూరాన్ని తప్పకుండ పాటించాలి.
4C. సంగీతం వినండి, యోగ చేయండి, పాటలు పాడుతూ నృత్యాలు చేయండి ఆరోగ్యంగా ఉండండి.
4D. ఇంటి నుంచే పని చేస్తుంటే ఒకే స్థానంలో 30 నిమిషాలకు మించి ఉండరాదని సూచించారు.
5. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మీ మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలి. ఒత్తిడికి, తికమకకు తావివ్వరాదు.
5A. మీరు ఉంటున్న చుట్టూ పక్కల అందరికి వీలైనంత సహాయ సహకారాలు అందించాలి. మీ కుటుంభ సభ్యులు, స్నేహితులు అలాగే ఇరుగుపొరుగు సభ్యుల క్షేమ సమాచారం తప్పకుండ తెలుసుకోవాలి.
5B. ఇంట్లోనే ఆడుకునే ఆటలు, పాటలు వినడం, యోగా చేయడం మంచిది.
5C. నిజ నిర్ధారణ కలిగిన వార్తలను ఎప్పటికప్పుడు అందరూ తెలుసుకోవాలి.

ప్రపంచాన్ని కోవిడ్19 అతలాకుతలం చేస్తోంది. మన సమాజం నుంచి ఈ వైరస్ కారణంగా చాలా చాలా కోల్పోతున్నాం అలాగే మనము అందరం ఒక్కటే ఐక్యమత్యంతో ఉండేలా మనవాళికి ఓ మంచి గుణపాఠం కూడా నేర్పుతోంది.

కలిసి ఐక్యమత్యంతో పని చేయండి, అందరూ గుణపాఠాలు నేర్చుకోండి, ప్రపంచ మానవాళి అందరూ ఒక్కటిగా మేలవండి అంటూ WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రస్ అదానం గేబ్రియాసస్ హితవు పలికారు. ధన్యవాదాలు.