Covid-19 కోఆర్డినేషన్ కమిటీ సమావేశం.

Covid-19 కోఆర్డినేషన్ కమిటీ సమావేశం.

Covid-19 పై సచివాలయంలో స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశమైంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలని కోరిన ఆరోగ్యమంత్రి ఈటెల అధికారులను ఆదేశించారు. గాంధీ ఆసుపత్రిలో covid-19 పాజిటివ్ తో చేరిన వ్యక్తికి పూర్తిగా మెరుగైందని త్వరలో డిశ్చార్జ్ చేయబోతున్నారని అధికారులన్నారు.
తెలంగాణలో ఇప్పటికి ఒక్క కేసు కూడా పాజిటివ్ లేదు.
అంతర్జాతీయ విమనాశ్రయానికి స్టాండి ధర్మో స్క్రీన్ లు కూడా అందించాము. విమానాశ్రయంలో ప్రతి విదేశీ ప్రయాణీకులను స్క్రీన్ చేస్తున్నాం. బయటి దేశం నుండి వచ్చే వారు ఖచ్చితంగా 14 రోజులు ఇంట్లోనే లో ఉండాలి. కుటుంబసభ్యులను కానీ, బయటి వారిని ఎట్టిపరిస్థితుల్లో కలవవద్దు. విదేశాలనుండి వచ్చే వారికి 104 కాల్ సెంటర్ నుండి ఫోన్లు వస్తాయి, దయచేసి సమాచారం ఇవ్వండి. విదేశాల నుండి వచ్చే వారి ద్వారా మాత్రమే తెలంగాణ గడ్డ మీదికి covid-19 వైరస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి సహకరించండి. సోషల్ మీడియా లో వస్తున్న తప్పుడు వార్తలపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫోనులో మంత్రి సూచించించారు.
సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారాలు చేయవద్దని అందరికి విజ్ఞప్తి చేశారు.

బహిరంగ ప్రదేశాల్లో సభలు, సమావేశాలు నిర్వహించ వద్దు. కాన్ఫరెన్స్ లు/ సెమినార్ లు కొద్ది రోజులు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఈటెల అన్నారు.
ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ప్రత్యేక అధికారి శ్రీదేవి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శంకర్ పాల్గొన్నారు.