దేశంలో స్మార్ట్ కరోనా క్లినింగ్

బ‌హిరంగ ప్ర‌దేశాలు ప్ర‌జ‌ల సామాజిక జీవ‌నంలో కీల‌క పాత్ర పోషిస్తాయి. కరోనా వైరస్ వ్యాధి 2019 (కోవిడ్‌ -19) అనేది ఒక నోవెల్‌ కరోనా వైరస్ (సార్స్‌-సిఒవి-2) వల్ల కలిగే తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి, ఇది చాలా సందర్భాలలో శ్వాసకోశ బిందువుల ద్వారా, వ్యాధిక‌లిగిన వారితో ప్రత్యక్ష సంబంధం , వైర‌స్ క‌లిగిన‌ ఉపరితలాలు / వస్తువుల ద్వారా వ్యాపిస్తుంది. వైరస్ వివిధ‌ ఉపరితలాలపై విభిన్న కాలానికి మనుగడలో ఉన్నప్పటికీ, రసాయన క్రిమిసంహారక మందుల ద్వారా ఇది సులభంగా క్రియాశీల‌త‌ను కోల్పోతుంది.

కోవిడ్ -19 వ్యాప్తిని ప్ర‌పంచ‌ మహమ్మారిగా ప్రకటించినప్పటి నుండి, నగరాలను పరిశుభ్రపరచడంలో భార‌తీయ న‌గ‌రాలు గణనీయమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రత్యేకించి బహిరంగ ప్రదేశాలు వైరస్ వ్యాప్తికి ప్రమాదకర ప్రాంతాలుగా పరిగణించబడుతున్నాయి. 2020 మార్చి 25 న దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి, బస్సులు , రైల్వే స్టేషన్లు, వీధులు, మార్కెట్లు, ఆసుపత్రి ప్రాంగణాలు, బ్యాంకులు మొదలైన వాటితో సహా బహిరంగ ప్రదేశాలను క్రిమిసంహారకాల‌తో శుభ్రం చేయడానికి నగరపాల‌క సంస్థ‌లు అనేక విధానాలను అనుసరిస్తున్నాయి.

నగరపాల‌క సంస్థ‌లు , అగ్నిమాపక విభాగాల స‌హ‌కారంతో క్రిమిసంహారక మందులను పిచికారీ చేయడం ద్వారా ఆయా నగరాల‌లోని అన్ని వీధులను శుభ్రపరచడానికి ఫైర్-టెండర్లు, వాటర్ వాష్ పంపులు మొదలైనవి ఉపయోగిస్తున్నారు.
తాజా కూరగాయల వంటి నిత్యావసరాలను అందుబాటులో ఉండ‌లా చూసేందుకు ,నగరాల్లోవ్యవసాయ మార్కెట్లు కార్యరూపం దాల్చాయి. ఈ ప్రదేశాలను సురక్షితంగా ఉంచడానికి నగర పాల‌క సంస్థ‌లు చర్యలు తీసుకున్నాయి. కూరగాయల మార్కెట్లు ఇతర బహిరంగ ప్రదేశాలలో చేతులు కడుక్కోవడానికి సదుపాయాలు కల్పిస్తున్నారు.
సోడియం హైపోక్లోరైట్ ను ఉపయోగించి బహిరంగ ప్రదేశాలలో క్రిమిర‌హితం చేసేందుకు నగరాలు వినూత్న విధానాలను అనుస‌రిస్తున్నాయి. ఉదాహరణకు తిరుప్పూర్ ఇటీవల డిస్ ఇన్ఫెక్ష‌న్ ట‌న్నెల్ ను ఉప‌యోగించింది. ఇది ఇప్పుడు అనేక నగరాల్లో వ్యవసాయ మార్కెట్లు, కూరగాయల మార్కెట్లలో క‌నిపిస్తోంది. ఈ న‌మూనా ఆధారంగా, అత్యావ‌శ్య‌క సేవలను అందించే వివిధ సంస్థలు డిజ్ ఇన్‌ఫెక్ష‌న్ ఛాంబ‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్నాయి. వీధులను క్రిమి ర‌హితం చేయ‌డంలో సమర్థవంతమైన ఫ‌లితాల కోసం, రాజ్‌కోట్ , సూరత్ నగరాలు హై-క్లియరెన్స్ బూమ్ స్ప్రేయర్‌లను వాడుతున్నాయి.

స్మార్ట్ సిటీలైన చెన్నై, బెంగళూరు, రాయ్ పూర్, గౌహతిలు వ్య‌క్తులు వెళ్లి క్రిమిసంహార‌కాల‌తో శుభ్రం చేయ‌డం కష్టమయ్యే బహిరంగ ప్రదేశాలను క్రిమిర‌హితం చేయడానికి, డ్రోన్స్ వంటి సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు సంసిద్ధ‌మ‌య్యాయి.