కాలన్నీ వృధా చేయరాదు! కరోనా కట్టడికి మనం ఏం చేయాలి?

కాలన్నీ వృధా చేయరాదు. అలాగే
కరోనా కట్టడికి మనం ఏం చేయాలి?

ఈ రోజు నుంచి మరో రెండు మూడు నెలలు అంటే జూన్
నెలాఖారు వరకు కరోనా కారణంగా పరిస్థితులు చాలా
భిన్నంగా ఉండబోతున్నాయి. ప్రజలంతా బయట తిరగకుండా సాధ్యమైనంతగా వీలైతే 24/7 ఇళ్లలోనే ఉండాలి. అలాంటప్పుడు మనం ఇంటికే పరిమితమైతే ఏమి చేయాలని ఎలా ఉండాలని అనుకుంటున్నారా ఐతే ఈ కింది వివరాలు పూర్తిగా చదవండి.

1.కరోనా కట్టడి కోసం వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి.
అందుకే పళ్లు, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తినాలి.

2.ప్రతిరోజు 15-30 నిమిషాలు వ్యాయామం చేయాలి.

3.ప్రజలందరూ సాధ్యమైనంత వరకు ఫేస్ బుక్, వాట్సప్ సోషల్ మీడియా యాప్స్ అన్నింటికీ దూరంగా ఉండాలి.
మీరు భవిష్యత్తులో ఎదగాలనే రంగాలలోని వ్యక్తులు, సంస్థలని గురించి తెలుసుకొని ప్రొఫెషనల్ కనక్షన్స్ పెంచుకోండి. తప్పకుండా ఏ రెండు నెలలు ONLINE
కోర్సులు చేసి భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకోవాలి.

కరోనా మరణాల్లో ఇటలీ1, చైనా2

4. గృహిణులు మీ ఇంట్లో ఆడ, మగ అనే తేడా లేకుండా అందరికీ మంచిగా వంటలు చేయడం ఎలా నేర్పండి.
మన ఇంట్లో శుభ్రత-పరిశుభ్రత అంటే ఏంటీ పరిసరాలు
ఎలా ఉండాలి అనే విషయంపై యువతకు అవగాహన కల్పించండి. నేటి తరానికి గృహ సంరక్షణ బాధ్యతలు నేర్పాల్సిన అవసరం ఉంది.

5. కాలాన్ని వృధా చేయకుండ సినిమాలు, బాతకానీలు కాకుండా ఓ మంచి పుస్తకం ఓ మంచి స్నేహితుడు అంటారు కదా అలాగే అందరూ మంచి పుస్తకాలు చదవండి. అప్పుడప్పుడు మంచి సంగీతం వింటూ అందరితో సరదాగా ఉండాలి.

6. ఎప్పుడైనా సరే సమయం విలువైనది కాలాన్ని కొనలేం కాబట్టి మన గురించి మనం భవిష్యత్తులో చేయాల్సిన, నేర్చుకోవాల్సిన అంశాలపై దృష్టిపెట్టండి. ఇరుగుపొరుగు పక్కోళ్ల గురించి ఆలోచించి పైత్యాన్నీ తెచ్చుకోకండి సమయాన్నీ వృధా చేయకండి.

భారతదేశంలో కరోనా పూర్తి వివరాలు.

7. అయ్యో ఈ ప్రపంచానికి ఏమైంది అంటూ లెక్చర్ ఇవ్వకుండా విపత్తు కాలంలో మనల్ని మనం సాన పట్టుకోవడం కోసం ఏమి చేయాలి బలహీనతలను ఎలా పారద్రోలాలి, శక్తియుక్తుల్ని ఎలా సాధించాలో దృష్టి పెట్టాలి. పశ్చిమదేశ పోకడలకు స్వస్తి పలికి స్వదేశ జ్ఞానాన్ని ఒంటపట్టించుకోవాలి.

8. ప్రకృతికి, అలాగే ఇలాంటి కరోనా లాంటి మహామ్మారిలకు పేద ధనిక భేదాలు ఉండవు ప్రపంచాన్నే గడగడలదించేస్తున్నాయి. కాబట్టి భేషజాలు, భేదాభిప్రాయాలు, కులమతాలు పక్కనబెట్టి అందరం సమానమే. ఐక్యమత్యంగా కలిసి మెలసి ఉండటం ఎలా అనే అంశాలపై ఆలోచించండి. అంతే కానీ క్రికెటర్లు, సినిమా హీరోలే దేవుళ్ళని ప్రేమించటం మానుకుని మానవసేవే మాధవ సేవ సాటి మానవుణ్ణి గౌరవించడం అంటే ఏంటో తెలుసుకోవాలి.

ఎన్నాళ్లో వేచిన ఉదయం. నిర్భయ దోషులకు ఉరి అమలు.

9. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసే సలహాలు, సూచనలు, జాగ్రత్తలు తప్పకుండా అందరూ పాటించాలి. లేదంటే క్రమశిక్షణ లేకపోతే పోయే కాలం దాపురించినట్టే. అందుకు ఉదహారణే ఇటలీ, ఇరాన్
దేశాల నిర్లక్ష్యం, క్రమశిక్షణ రాహిత్యం.

10. అజాగ్రత్తగా వద్దు అప్రమత్తత ముద్దు. అపోహలు వీడుదాం అవగాహన పెంచుకుందాం. ఎవరు కూడా
ఆందోళన, ఆవేదన, భయలడాల్సిన అవసరం లేదు.
ధైర్యంగా దేశ ప్రజలందరం ఐక్యమత్యంగా అందరం
ఒకే మాట ఒకే బాటలో నడిచి ప్రపంచ మానవాళికి మార్గదర్శకులం అవుదాం.

సర్వేజనా సుఖినో భవంతు. సర్వేజనా సుఖినో భవంతు.