కరోనా మరణాల్లో ఇటలీ1, చైనా2

కరోనా మరణాల్లో ఇటలీ1, చైనా2

ప్రపంచ వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం 2లక్షల 46వేళా కేసులు అందులో 10050మంది మృతుల సంఖ్య నమోదైంది.

ఇటలీలో కరోనా మృతులు సంఖ్య 3405 చైనాలో 3248
ఇరాన్ 1824 స్పెయిన్ 831 ఫ్రాన్స్ 372 USA218 UKలో
144 మంది కరోనా కాటుకు చనిపోయారు.

భారత్ లో 20th 9AM కరోనా కేసులు 195. 

కరోనా మరణాల్లో చైనాను అధిగమించిన ఇటలీ.
ఇటలీలో 3,405 మంది మృతి
కరోనా కాటుకు చైనాలో 3248 మంది బలి

చైనాలో బుధవారం ఒక్క కేసూ నమోదు కాని వైనం
స్పెయిన్‌లో 209 నుంచి 767కు పెరిగిన మృతుల సంఖ్య.
ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తున్నా క‌రోనా ప్ర‌స్తుతం ఇట‌లీని ప‌ట్టిపీడిస్తోంది. చైనాను అల్లాడించిన కరోనా వైరస్ ఇప్పుడు ఇటలీలో అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తుంది. ఒక్క నెలలోనే ఆ దేశంలో ఈ మహమ్మారి కారణంగా మృతి చెందినవారి సంఖ్య 3,405కు చేరుకుంది. వైరస్ పుట్టిన చైనాలో మాత్రం నిన్నటి వరకు నమోదైన మరణాలు 3245 మాత్రమే. ఇటలీలో 24 గంటల వ్యవధిలోనే 427 మరణాలు సంభవించడం అక్కడి తీవ్రతకు అద్దంపడుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చైనాలో క‌నుమ‌రుగవుతున్న మ‌హామ్మారి:
-మరోవైపు, చైనాలో పురుడు పోసుకున్న ఈ మహమ్మారి అక్కడ క్రమంగా కనుమరుగవుతోంది. బుధవారం అక్కడ ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. ఈ విషయాన్ని ఆ దేశ వైద్యశాఖ నిర్ధారించింది. చైనా తర్వాత ఇటలీ, ఇరాన్, స్పెయిన్ దేశాలు కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. స్పెయిన్‌లో మరణించిన వారి సంఖ్య 209 నుంచి ఒక్కసారిగా 767కు పెరగడం గమనార్హం.

మార్చి 20 ఉదయం 9 గంటల వరకు తెలంగాణలో 16 పాజిటివ్ కేసులు ఆలాగే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా ముగ్గురికి సంఖ్య చేరింది.