బ్రిటన్ ప్రధానమంత్రికి కరోనా

వదల బొమ్మాలి నేనెవరినీ వదలను అంటూ కరోనా వైరస్
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కాటేసింది. జాన్సన్‌కు స్వల్పంగా వైరస్ లక్షణాలు ఉండటంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఇంగ్లండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ క్రిస్ విట్టీ ఆదేశాలతో ప్రధానమంత్రికి పరీక్షలు నిర్వహించామని అధికారిక ప్రతినిధి ప్రకటించారు. కరోనా పాజిటివ్ తేలిన అనంతరం బోరిస్ జాన్సన్ ట్విటర్‌లో ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు. నాలో కరోనా వైరస్ లక్షణాలు స్వల్పంగా బయటపడ్డాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగింది, దగ్గు రావడంతో
చీఫ్ మెడికల్ ఆఫీసర్ తీసుకుని పరీక్షలు చేసుకున్నాను.
ఐతే ఇప్పటి వరకు UKలో 14,549కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 759 మంది చనిపోయారు. వేల్స్ యువరాజు చార్లెస్‌ కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.