రైతులకు క్రెడిట్, డెబిట్ కార్డులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులెవరికి నా డబ్బు నా చేతికి రాదు అన్న భయం ఉండకూడదు, సంబంధిత బ్యాంక్‌కు వెళ్ళి కార్డు చూపగానే డబ్బు రైతు చేతికిచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

రాష్ట్రంలో రైతులకు ఈ-క్రాప్‌కు లింక్‌ చేస్తూ క్రెడిట్‌ కార్డు ఉండాలి. ప్రభుత్వం ఇచ్చే డబ్బు డెబిట్‌ కార్డు ద్వారా రైతుకు అందాలి. కొత్త క్రెడిట్‌ కార్డులు ఇవ్వడంతోపాటు కొత్త అకౌంట్లు ఓపెన్‌ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. 56 లక్షల క్రెడిట్, 56 లక్షల డెబిట్‌ కార్డులు ఈ ఖరీఫ్‌కి సిద్దమవ్వాలి. గ్రామస్థాయిలో గ్రేడింగ్, ప్యాకింగ్‌ జరిగితే మంచి ఫలితాలు వస్తాయి. మొత్తం 11,158 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు AP సర్కారు చేస్తోంది.