కరోనా క్వారంటైన్ క్రికెటర్ కోహ్లీ కటింగ్

దేశంలో ప్రజలందరూ కరోనా కట్టడి లాక్ డౌన్ విధానంకు సహకరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లబోదిబో మొత్తుకుంటున్నాయి. కానీ మాది ప్రజాస్వామ్య దేశం మాకు నచ్చినట్టు ఉంటాం నచ్చింది చేస్తామని ఎమెర్జెన్సీ విధిస్తే కూడా లెక్క చేయకుండా రోడ్లపై ప్రజలు చక్కర్లు కొడుతున్నారు. అయ్యా బాబు సామాజిక దూరం పాటించండి ఇంట్లోనే సురక్షితంగా ఉండండి అని పోలీసులు, డాక్టర్లు, నేతలు జనాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. క్వారంటైన్ ఉండమంటే ఎందుకు మనకు చెవులకు ఎక్కదో తెలియదు? ఓ వైపు ప్రపంచంలో అత్యధికంగా శనివారం అమెరికా No1 స్థానంలో కరోనా లక్ష కేసులు దాటి పోయింది. తర్వాత ఇటలీ, చైనా, స్పెయిన్ దేశాలు వరుసలోన్నాయి.

కానీ మనం భారతీయులు 125కోట్ల అత్యధిక జనాభా కలిగిన దేశం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాము. ఈ నిర్లక్ష్యం ఖరీదు మీ ఒక్కరి ప్రాణాలే కాదు చాలా మంది మీ కారణంగా కరోనా వైరస్ సోకే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త అపాయం ఎక్కడి నుంచి పొంచి ఉందో ఆ భగవంతుడికే తెలియాలి. కానీ ఈ క్లిష్ట పరిస్థితుల్లో క్వారంటైన్ నరకం కాదు స్వర్గమని మోస్ట్ పాపులర్ జంట క్రికెటర్ విరాట్ కోహ్లీ-బాలీవుడ్ భామ అనుష్క శర్మ నిరూపిస్తున్నారు.

క్వారంటైన్ ఉండటమనేది కరోనా సోకిన వాళ్లకు మాత్రమే కాదు ప్రజలు అందరికి వర్తిస్తుంది. ఖచ్చితంగా అందరూ ఇంటికే పరిమితం కావాలని కోహ్లీ-అనుష్క జంట సందేశం ఇస్తున్నారు. ప్రపంచంలో ఇప్పటికి 5లక్షల మంది కరోనాతో చనిపోయారు కనీసం మనకు తెలివితేటలు ఉన్నాయా ఎలా జాగ్రత్తగా ఉండాలనేది తెలియదా? క్వారంటైన్ ఓ మధురానుభూతిలా నిలిచేలా కుటుంభ సభ్యులతో మెలగాలని ఆవేదనతో నిరాశ నిస్పృహాలతో ఉండరాదని చెబుతున్నారు. సమాజహితం కోరే వాళ్ళందరూ ప్రతి ఒక్క భారతీయుడు క్వారంటైన్ ఇంటికే పరిమితం కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. క్వారంటైన్ సమయంలో ఆనందంగా ఎలా ఉండాలో చూపెడుతూ కోహ్లీ-అనుష్క భార్యాభర్తలు ఇద్దరు
ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇంట్లో సంతోషంగా అనుష్క కత్తెర తీసుకుని కోహ్లీకి కటింగ్ చేస్తున్నప్పుడు ఇద్దరు అన్యోన్యంగా సంతోషంగా ఉంటూ సమాజానికి సేవ చేస్తున్నాము మీరు చేయాలంటే ఇంట్లోనే ఉండండి అందరూ ఉండేలా చూడండి అంటూ హితవు పలుకుతున్నారు. ఈ కటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశభక్తి, ప్రజాహితం సరిహద్దుల్లో కాపలా ఉండే జవాన్లు మాత్రమే కాదు ప్రతి పౌరుడు ఈ అత్యవసర విపత్కర పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండటం కూడా సమాజ సేవేనని, ప్రజలందరూ అర్థం చేసుకుని గృహమే కదా స్వర్గ సీమా అనుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను పాటించాలని ఈ జంట కోరుతోంది.
భారతీయుల్లారా మీ అందరికి ఒకే విజ్ఞప్తి కరోనా మహామ్మారికి మందులేదు ఇప్పటికి శాస్త్రవేత్తలు కనుగొనలేదు మీ ప్రాణాలకు మీరే భాద్యులు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మరవొద్దు.