కరోనా కట్టడికి గృహమే స్వర్గసీమ

కరోనా కట్టడికి గృహమే స్వర్గసీమ

కరోనా కట్టడికి ప్రజలంతా ఏకమై గృహాలకు2పరిమితం కావాలని క్రికెటర్ విరాట్‌ కోహ్లీ దంపతులు పిలుపునిచ్చారు. భార్య అనుష్క శర్మతో కలిసి ఓ వీడియోలో ప్రపంచం ఎదుర్కుంటున్న కోవిడ్19 సవాలుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. భారతదేశమే కాదు ప్రపంచమే ‘ప్రస్తుతం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంది. కాబట్టి కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు ప్రజలంతా ఐక్యంగా కృషిచేయాలి. భార్యభర్తలం మేమిద్దరం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటున్నాం అలాగే మన దేశ ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లలోనే ఉండటం మంచిది’ అని
కోహ్లీ ఆసుష్క విజ్ఞప్తి చేసారు.

దేశ వ్యాప్తంగా ప్రజలందరూ గృహాలకే పరిమితం అవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల
ముఖ్యమంత్రులు అలాగే అన్ని రాష్ట్రాల CMs, బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సినిమా నటీనటులు కోవిడ్19 అరికట్టాలంటే మన గృహమే మనకు స్వర్గసీమని విజ్ఞప్తి చేసారు.