కరోనా యుద్ధంలో రక్షణ కవచం

బెంగళూరు CSIR ఆధ్వర్యంలోని CSIR-ఎయిరో స్పేస్ లాబొరేటరీస్ సంస్థ బెంగళూరు లోని ఎమ్.ఏ.ఎఫ్. క్లోథింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కలిసి పూర్తిగా రక్షణ కల్పించే కవర్ ఆల్ సూట్ ని అభివృద్ధి చేసి ధృవీకరించింది. కోవిడ్-19 ఉపశమనం కోసం 2 గంటలు పనిచేస్తున్న వైద్యులు, నర్సులు. పారామెడికల్ సిబ్బంది, ఆరోగ్య పరిరక్షణ కార్మికుల రక్షణ కోసం అనేక పొరలతో నేయని బట్ట ఆధారంగా తయారుచేసిన ఈ పాలీప్రొప్లీన్ స్పన్ లామినేటెడ్ కవర్ ఆల్ సూట్ ను ఉపయోగించవచ్చు.

సమస్యకు పరిష్కారం కోసం డాక్టర్ హరీష్ సి. బార్షిలియా, డాక్టర్ హేమంత్ కుమార్ శుక్లా, ఎమ్.ఏ.ఎఫ్. కి చెందిన శ్రీ ఎమ్.జే. విజు నాయకత్వంలోని సి.ఎస్.ఐ.ఆర్.-ఎన్.ఏ.ఎల్. బృందం తీవ్రంగా కృషి చేసి తగిన స్వదేశీ పదార్ధాలు, వినూత్న తయారీ ప్రక్రియలను రూపొందించారు.

కోయింబత్తుర్ లోని సి.ఐ.టి.ఆర్.ఏ. లో కఠినమైన పరీక్షల అనంతరం కవర్ ఆల్ ఉపయోగానికి ధృవీకరించబడింది. నాలుగు వారాలలో రోజుకు 30,000 యూనిట్లు తయారుచేసే సామర్థ్యంతో ఉత్పత్తి ప్రారంభించడానికి CSIR-NAL మరియు MAF ఈ రెండు సంస్థలు ప్రణాళికలు రూపొందించాయి.

ఇతర తయారీదారులతో పోలిస్తే ఈ కవర్ ఆల్ ధర చాలా తక్కువ మరియు ఇందులో ఉపయోగించిన దిగుమతులు కూడా తక్కువ అని – సి.ఎస్.ఐ.ఆర్.-ఎన్.ఏ.ఎల్. డైరెక్టర్ శ్రీ జితేంద్ర జే. జాదవ్ పేర్కొన్నారు. జాతీయ ప్రయోజన కోసం 24 గంటలు పనిచేసి, ఈ కవర్ ఆల్ ను అభివృద్ధి చేసి, ధృవీకరణ ప్రక్రియను అత్యంత తక్కువ సమయంలో పూర్తిచేసిన NAL., మరియు MAF. క్లోథింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు CITRA. బృందాన్ని ఆయన అభినందించారు.