కరోనా యుద్ధంలో ఇండియా అస్త్రాలు

మన దేశంలో అత్యున్నతమైన సంస్థ CSIRలో భాగమైన ప్రయోగశాల CSIR-NCL పూణే తన వెంచర్ సెంటర్ ద్వారా ఆవిష్కరణ మరియు వ్యవస్ధాపకతను పోషించడంలో గత దశాబ్ద కాలంగా ముందు వరుసలో ఉంది. ఇప్పుడు కరోనా వ్యాప్తి కి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో కూడా ఈ కేంద్రానికి చెందిన ఆవిష్కరణలు సహాయపడుతున్నాయి.

వాటిలో కరోనా వ్యాప్తి ని అరికట్టడానికి ఉపయోగపడే రెండు ఇటీవలి ఆవిష్కరణల గురించి ఇప్పుడు తెలుసుకుందాం:

1)డిజిటల్ ఐ.ఆర్.థెర్మో మీటర్
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో ముఖ్యంగా ఉపయోగపడే ఓ పరికరం “డిజిటల్ ఐ.ఆర్. థెర్మో మీటర్”.
శ్రీ ప్రతీక్ కులకర్ణి నాయకత్వంలో CSIR-NCLకు చెందిన అంకురసంస్థ BMEK అభివృద్ధి చేసింది. ఈ పరికరానికి విద్యుత్ వ్యవస్థను అందించడానికి మొబైల్ ఫోను లేదా పవర్ బ్యాంకును కూడా ఉపయోగించవచ్చు. ఐ.ఆర్. థెర్మో మీటర్ ను దేశవ్యాప్తంగా భారీగా ఉత్పత్తి చేయడానికి అవసరమైన హార్డ్ వేర్ మరియు సాఫ్ట్ వేర్ తో కూడిన పూర్తి సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంది. ఈ థర్మోమీటర్లను ఉత్పత్తి దారులు భారీ ఎత్తున తయారుచేసి, స్థానికంగా ఉన్న డిమాండ్ ను చేరుకోడానికి ఈ కృషి ఎంతగానో ఉపయోగపడుతుంది. BEL (భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, పూణే) భాగస్వామ్యంతో ఇప్పుడు వీటిని భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాధమికంగా పంపిణీ చేసి, పరీక్ష చేయడానికి వంద ప్రొటోటైప్ యూనిట్లు బెంగుళూరు లోని టి.యు.వి. రెయిన్ ల్యాండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వద్ద సిద్ధంగా ఉన్నాయి.

2)ఆక్సిజన్ ఎన్రిచ్ మెంట్ యూనిట్ (OEU)
కోవిడ్-19 రోగులకు ఊపిరి తిత్తులు సరిగా పనిచేయకపోవడం వలన, వారికి అవసరమైన ఆక్సిజన్ అందించడం చాలా ముఖ్యం. గాలిలో ఉన్న ఆక్సీజన్ సాంద్రతను 21-22 శాతం నుండి 38-40 శాతానికి పేర్చడానికి ఆక్సిజన్ ఎన్రిచ్ మెంట్ యూనిట్ (ఓ.ఈ.యు.) లను సి.ఎస్.ఐ.ఆర్.-ఎన్.సి.ఎల్. మరియు జెనరిక్ మెంబ్రేన్స్ అంకురసంస్థ అభివృద్ధి చేసింది. ఎన్ .సి.ఎల్. లోని పాలిమర్ సైన్స్ & ఇంజనీరింగ్ డివిజన్ అధిపతి డాక్టర్ ఉల్హాస్ ఖరుల్ ఈ అంకురసంస్థను స్థాపించారు. ఇళ్లలోనూ, ఆసుపత్రుల్లోనూ గాలిలోని స్వచ్ఛమైన ఆక్సిజన్ ను రోగులకు అందించడానికి వీలుగా OEUలలో గాలిని వడబోసే ఫైబర్ మెంబ్రేన్ బండిల్స్ ఉంటాయి. పూణే లో సిద్ధంగా ఉన్న ప్రోటో టైపు యూనిట్లను పరీక్ష/ధ్రువీకరణ కోసం బెంగుళూరు లోని టి.యు.వి. రెయిన్ ల్యాండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు పంపుతున్నారు. పూణే లోని ఎన్.సి.ఎల్. ప్రస్తుతం సుమారు 10 OEU. యంత్రాలను తయారుచేస్తుంది. పరీక్షల అనంతరం,ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుతారు.

పూణే లోని పోలీసు డిప్యూటీ కమిషనర్ కు ఐదు ఇన్ఫ్రారెడ్ నాన్-కాంటాక్ట్ థెర్మోమీటర్లను అందజేశారు. జెనరిక్-ఎన్.సి.ఎల్. ఆక్సిజన్ ఎన్రిచ్ మెంట్ యూనిట్ యంత్రాన్ని పరీక్షార్థం పూణే సమీపంలోని ఒక మెడికల్ సెంటర్ లో ఒక రోగి శ్వాస తీసుకునే మాస్క్ వ్యవస్థకు అమర్చారు.