పోలీసులు పెట్రోలింగ్ విధుల్లో అప్రమత్తం: సీపీ సజ్జనార్

పోలీసులు పెట్రోలింగ్ విధుల్లో అప్రమత్తం: సీపీ సజ్జనార్

హైదరాబాద్ మహా నగరంలో పెట్రోలింగ్ విధుల్లో బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ సిబ్బందికి 17 వెర్టికల్లో భాగంగా ట్రైనింగ్ సెషన్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ
ప్రజలతో పోలీసులు సత్సంబంధాలు కొనసాగించాలన్నారు. నేర ప్రవృత్తి గల వ్యక్తులు, ఆర్థిక నేరగాళ్లు మొదలైన వారి వివరాలను గుర్తించి వారిపై నిరంతరం పటిష్టమైన నిఘా, సర్వైలెన్స్ ఉంచాలన్నారు. నేర నియంత్రణ కోసం తరచూ నేరాలు జరిగే ప్రదేశాల్లో TS-COP అప్లికేషన్ ద్వారా గుర్తించి,
పాట్రోల్ తో తరచు గస్తీ నిర్వహించాలన్నారు. బ్యాంకుల వద్ద ఎటిఎంల వద్ద సంచరించుతున్న అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేయాలన్నారు. అదేవిధంగా జనసంచారం లేని సమయాలలో తిరుగుతున్న అనుమానాస్పద వ్యక్తులను విచారించాలన్నారు. పెట్రోల్ కారు అధికారి విజిబుల్ పోలీసింగ్ హాయ్ కు అవసరమైన ప్రాంతాలను గుర్తించి అలాంటి ప్రాంతాల్లో పోలీసు పెట్రోలింగ్ నిర్వహించాలని అన్నారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న నూతన సాంకేతిక పరిజ్ఞానం గురించి ప్రజలకు వివరిస్తూ ఇంటర్నెట్ మొబైల్ ద్వారా పోలీస్ సేవలు ఏ విధంగా తీసుకోవాలో ప్రజలకు వివరించాలన్నారు.
కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా కాలనీల్లోని ప్రజలతో వాణిజ్య సంస్థలు ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వేతర సంస్థలు వెల్ఫేర్ అసోసియేషన్ అపార్ట్మెంట్ కమిటీలు స్కూల్స్ మరియు కాలేజీలు నిరంతరం కమిటీ సమావేశం నిర్వహించాలన్నారు.


పోలీసు విధుల్లో ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు సాంకేతిక పరిజ్ఞాన అనువర్తనాలైన Hawk-Eye, Facebook, Whatsapp మొదలగు వాటి వినియోగం ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ ఉండాలన్నారు. తక్షణ స్పందన పాట్రోల్ కారు కంట్రోల్ రూమ్ పోలీస్ స్టేషన్ కు ప్రజల నుంచి ఏదైనా ఫిర్యాదు వచ్చినప్పుడు తక్షణమే స్పందించాలి. సమస్యలపై తక్షణం స్పందించి అతి తక్కువ సమయంలో బాధితులకు రక్షణ సాయం అందించాలి. పోలీసు ఉద్యోగులు అందరూ సంబంధిత చట్టాలు లీగల్ ప్రొవిజన్స్, ప్రొసీజర్స్ మేజర్ చట్టాలు అయిన IPC, CRPC&IEAలు, ప్రత్యేక మరియు స్థానిక చట్టాలు అండ్ మ్యానువల్స్ అన్నింటిపై మరియు అవగాహన కలిగి రోజు వారి విధుల్లో ఉపయోగించాలన్నారు.
పాట్రోల్ కారు అధికారికి Cognizable and non Cognizable నేరాల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. వీటి గురించి CRPC లోని సెక్షన్ 2 లో వివరించారన్నారు.

ప్రజలతో మర్యాదగా మాట్లాడాలన్నారు. Dial 100 రెస్పాన్స్ టైం తగ్గించాలన్నారు. పోలీసులు అందరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఐపిఎస్, డీసీపీ క్రైమ్స్ రోహిణీ ప్రియదర్శినీ ఐపిఎస్, ఎస్బి ఏసీపీ రవికుమార్, పెట్రోలింగ్ అండ్ బ్లూ కోల్ట్స్ కు చెందిన ఫస్ట్ బ్యాచ్ కు చెందిన పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.