కరోనా విరాళాలపై సైబర్ అలర్ట్

మీరు ప్రధాన మంత్రి, మరియు ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళాలు పంపుతున్నారా! ఐతే ఇటువంటి సమయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖాతాలకు డబ్బులు వేసే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సైబర్ నేరగాళ్ల మోసాలపై జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇటీవలే సైబర్ నేరగాళ్లు PM cares మరియు CM relief fundల పేరుతో అలాంటి UPI IDలను క్రియేట్ చేసేసుకుని ప్రజలు ఇచ్చే డబ్బులను తమ ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నారు ప్రజలను తస్మాత్ జాగ్రత్త.

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు,తుఫాన్లు వచ్చినప్పుడు ఇటీవల కాలంలో కరోనా బాధితులకు ప్రజలు స్వచ్చందంగా అందించే విరాళాల కోసం దేశం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ఖాతాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే అదునుగా అటువంటి ఖాతాలను ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగించటం జరుగుతుంది.

సైబర్ నేరగాళ్లు ఇటువంటి విరాళాల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఖాతాలను పోలి ఉండే UPI ID ఖాతాలను ప్రధాన మంత్రి సహాయ నిధి, ముఖ్యమంత్రి సహాయ నిధుల పేరిట google pay మరియు phone pay నందు account లను creat చేసుకొని ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ విషయాలన్ని అవగాహన లేకపోవడంతో ప్రజలు సైబర్ నేరగాళ్ల ఖాతాలకు పంపిస్తున్నారు.

సైబర్ నేరాలు జాగ్రత్తలు :
1. మీరు విరాళాలు ఇవ్వడంపై బ్యాంక్ ఖాతాల కోసం GOOGLE సెర్చ్ చేయరాదు.
2. మీరు గవర్నమెంట్ అధికారిక వెబ్ సైట్ URLలోనే విరాళాలు పంపించాలి.
3.మీరు డబ్బులు సెండ్ చేయగానే మీకు అధికారికంగా ధృవీకరణ పత్రాన్ని ఇస్తారు గమనించాలి.
4. ధృవీకరణ పత్రం రాకపోతే మీరు వేసింది గవర్నమెంట్ ఖాతాలలో కాదు అనే విషయాన్ని గ్రహించాలి.
5. ఏమైనా సమస్యలు, సందేహాలుంటే స్ధానిక పోలీసు స్టేషన్ లో గాని, సైబర్ ల్యాబ్ పోలీసులకు గాని లేదా సైబర్ మిత్ర వాట్సప్ NO 9121211100కు సంప్రదించి ఫిర్యాదు చేయాలన్నారు. ఈ సంధర్బంగా కర్నూలు జిల్లా SP
డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS ఈ వివరాలను మీడియాకు తెలిపారు.