సైబర్ నేరగాళ్లున్నారు జాగ్రత్త

సైబర్ నేరగాళ్లున్నారు జాగ్రత్త

మీరు మీ వ్యక్తిగత సమాచారంతో పాటు మీ యొక్క వేలి ముద్రలను తరచుగా సమాచారం నిమిత్తం ఇస్తుంటారా? అయితే మీ ఖాతా ఖాళీ అయ్యే అవకాశం ఉంది జాగ్రత్త !

ఎందుకంటే ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు వేలి ముద్రలను ఆధారంగా చేసుకొని ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఈ తరహా మోసంలో మొదటగా సైబర్ నేరగాళ్ళు మీ వ్యక్తిగత వివరాలను, అనగా ఆధార్ కార్డు వివరాలు, మీ బ్యాంకు ఖాతా వివరాలు , మీ యొక్క వేలి ముద్రలను వివిధ మార్గాల ద్వారా సేకరిస్తారు. ఆ విధంగా సేకరించిన మీ యొక్క ఖాతా, వేలి ముద్రల వివరాలను ఉపయోగించి మీ యొక్క ఖాతా నుండి డబ్బులను డ్రా చేసుకుంటున్నారు. ఈ విధమైన డబ్బును డ్రా చేసే పద్దతినే AEPS(Aadhaar Enabled Payment system) అని అంటారు.

ఈ AEPS ద్వారా డబ్బులను పొందటం కోసం మీ యొక్క ఖాతాకు లింకు అయినటువంటి ఆధార్ కార్డు వివరాలతో పాటు మీ యొక్క వేలి ముద్రలు అవసరం. ఈ AEPS withdraw సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైతే ATM సౌకర్యం అందుబాటులో ఉండదో ఆ ప్రాంతాలలో నగదును ప్రజలు తీసుకోవడం కోసం కల్పించారు, ఈ రకంగా నగదును 10,000/- లోపు మన సౌకర్యం నిమిత్తం డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ రకంగా బ్యాంక్ ఖాతా ను బట్టి ఎన్ని సారులైన సైబర్ నేరగాళ్లు ఈ సౌకర్యాన్ని వినియోగించి ఖాతా దారుల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.

ఈ విధoగానే సైబర్ నేరగాళ్లు కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ఒక వ్యక్తి ఖాతా నుండి డబ్బులను కాజేసారు. ఈ విధమైన మోసాలతో సైబర్ నేరగాళ్లు ఈ వ్యక్తికి సంబoదించినటువంటి వ్యక్తిగత సమాచారం తో పాటు అతని ఖాతా వివరాలు మరియు వేలి ముద్రల ద్వారా ఆ వ్యక్తి ఖాతా నుండి రూ. 1,07,800/- రూపాయలను కాజేసారు. డబ్బులు డ్రా అయిన విషయం తెలిసిన ఆ బాధితుడు పోలీసుస్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశాడు.

అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మీ యొక్క ఖాతాకు లింకు అయినటు వంటి ఆధార్ కార్డును మీ మొబైలు నెంబర్ లింకు చేయాలి. మీరు బ్యాంక్ ఖాతాకు ఇచ్చిన ఆధార్ కార్డు ప్రూఫ్ స్థానoలో మరో ఐడి ప్రూఫును ఇవ్వండి. మీరు తరచుగా మీ యొక్క ఖాతా బ్యాలెన్సును
చెక్ చేసుకోండి. మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని ,
మరియు వేలి ముద్రలను అనవసరంగా ఇవ్వకండి .
మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోండి.

సైబర్ నేరగాళ్ళ మాటాలను నమ్మి మోసపోవద్దని , ఏమైనా సమస్యలు, సందేహాలుంటే స్ధానిక పోలీసు స్టేషన్ లో గాని, సైబర్ ల్యాబ్ పోలీసులకు గాని లేదా సైబర్ మిత్ర వాట్సప్ నెం. 9121211100 కు గాని సంప్రదించి ఫిర్యాదు చేయాలని ఈ సంధర్బంగా కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి తెలిపారు.