రక్తదానం చేయండి: CP సజ్జనార్, IPS


*- రక్తదాతల ఇంటి వద్దకే వాహనంలో పికప్ అండ్ డ్రాప్*
*- రక్తదానం ప్రాణదానంతో సమానం*
*- రక్తదానంపై అపోహలు వద్దు*

సైబరాబాద్:* థలసేమియా, క్యాన్సర్, మెడికల్ ఎమర్జెన్సీ పేషంట్లు, బ్లడ్‌ కేన్సర్‌ రోగులు, హిమోఫీలియా తదితర జబ్బుల తో బాధపడుతున్న వారి కోసం ఈరోజు విద్యానగర్ అడిక్ మెట్ వద్ద ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వద్ద సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బ్లడ్ డొనేషన్ డ్రైవ్ లో ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపిా‌ఎస్ పాల్గొని రక్తధానం చేశారు.

సీపీ గారితో పాటుగా సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ సీఎస్ డబ్ల్యూ ఏడీసీపీ మాణిక్ రాజ్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రెటరీ (ఎస్సీఎస్సీ) జనరల్ సెక్రెటరీ కృష్ణ యేదుల, ఎస్సీఎస్సీ అసోసియేట్ డైరెక్టర్ పి చంద్రశేఖర్ రెడ్డి, సి‌టి‌సి డాక్టర్ సుకుమార్, ఆర్ఐ అరుణ్ కుమార్, ఆర్ఎస్ఐ ఫిలిప్ డోరాడో, ఏఆర్ సిబ్బంది, ఎస్సీఎస్సీ వలంటీర్లు బ్లడ్ డోనేషన్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ 19 దృష్ట్యా విధించన లాక్‌డౌన్‌ కారణంగా బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు తగ్గిపోయాయని.. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని.. రక్త నిల్వలు సేకరించడానికి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఇదే అంశమై ఇప్పటికే అన్ని ఐటీ కంపెనీలకు, ఉద్యోగుల వాట్సప్‌ గ్రూపులకు సమాచారం చేరవేశామని తెలిపారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు, పోలీస్‌ గ్రూపుల్లో విషయాన్ని షేర్‌ చేశామన్నారు. ఎక్కువ మొత్తంలో రక్తదాతలు ముందుకు వచ్చి తలసేమియా బాధితులకు అండగా నిలబడాలని సీపీ సజ్జనార్‌ పిలుపునిచ్చారు.

ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన మెడికల్ ఎమర్జెన్సీ పేషంట్లు, బ్లడ్‌ కేన్సర్‌ రోగులు, తలసేమియా, హిమోఫీలియా రక్తం అవసరం ఎక్కువగా ఉంటుంది. దీంతో వివిధ ఆస్పత్రుల్లో రక్తం అవసరమైన బాధితులు.. దాతల కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే రేర్‌ గ్రూప్‌లు అయిన ఏబీ-నెగెటివ్‌, ఓ-నెగెటివ్‌, బీ-నెగెటివ్‌, ఏ-నెగెటివ్‌ గ్రూప్‌ రక్తానికి తీవ్ర కొరత ఉంది. మరోవైపు ఇంట్లో నుంచి బయటకు వచ్చే వీలు లేకపోవడంతో దాతలు రక్తం ఇవ్వడం లేదు. వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్‌, ఐటీ కంపెనీల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించడం లేదు. దీంతో రక్తం నిల్వలు పడిపోయాయి. రక్తం దొరక్కపోవడంతో తలసేమియా బాధితుల ముఖ్యంగా చిన్నారులు ఇబ్బంది పడుతున్నారన్నారు. దీంతో.. అత్యవసరంగా రక్త నిల్వల్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. థలసేమియా.. హిమోఫీలియా బాధితులకు తరచూ రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. థలసేమియాతో బాధపడేవారికి కనీసం నెలకు రెండు సార్లైన రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది.

*రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చిన దాతల ఇంటికే వాహనం పంపిస్తామని తెలిపారు. వారిని ఇంటి వద్ద నుంచి తీసుకెళ్లి తిరిగి అదే వాహనంలో జాగ్రత్తగా ఇంటివద్ద దిగబెట్టాలని సూచించారు. దాతలు సైబరాబాద్‌ కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు 9490617440, 9490617431లో సంప్రదించాలని సూచించారు.*

రోడ్డు ప్రమాదాలు, ఆపరేషన్ల వంటి ఆపద సమయంలో ఉన్నవారికి సమాయానికి రక్తం దొరకక మృత్యువాత పడుతున్నారన్నారు. రక్తం కొరతను నివారించడానికి ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా రక్త దానం చేయాలన్నారు. రక్త దానం పై ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రక్తదానం చేస్తే బలహీనం అవుతామనే అపోహ సరికాదన్నారు. రక్త దానం చేస్తే తిరిగి కొత్త రక్తం వస్తుందన్నారు. పైగా మీరు డొనేట్ చేసిన రక్తం ఒకరి ప్రాణాన్ని బ్రతికించగలదన్నారు. తద్వారా ఒక కుటుంబానికి సహాయం చేసిన వారవుతారన్నారు. రక్తదానం చేసేందుకు దాతలు (బ్లడ్ డోనర్స్) ముందుకు రావాలన్నారు. ఒక ప్రాణాన్ని కాపాడినా చాలు ఒక కుటుంబాన్ని బతికించిన వారిమవుతామన్నారు.

థలసేమియా పేషంట్లకు రక్తం అవసరముందని, తమ వద్ద రక్త కొరత ఉందని.. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి పిచ్చి రెడ్డి తనను సంప్రదించిన వెంటనే బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటుకు అంగీకరించామన్నారు. రక్త ధానం పై ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ ఆపధలో ఉన్న వారిని ఆడుకుంటున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ని సీపీ గారు అభినందించారు.

తమ వంతుగా సైబరాబాద్ పోలీసులు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారన్నారు. పెద్ద ఎత్తున రక్తం కొరత ఉండడంతో కమ్యూనిటీలను భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్జిఓలు, వాలంటీర్లు, ఐటి, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు అందరూ రక్త దానం చేయాలన్నారు.

రానున్న రోజుల్లోనూ మరిన్ని బ్లడ్ డొనేషన్ క్యాంపులను ఏర్పాటు చేస్తామన్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంపులను ఏర్పాటు చేసే వారికి సైబరాబాద్ పోలీసుల సహకారం ఉంటుందన్నారు.

అనంతరం సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రెటరీ (ఎస్సీఎస్సీ) జనరల్ సెక్రెటరీ కృష్ణ యేదుల మాట్లాడుతూ అడిగిన వెంటనే ఇంత తక్కువ సమయంలో పెద్ద ఎత్తున రక్తధానం చేయడానికి ముందుకు వచ్చిన సైబరాబాద్ పోలీసులు, ఎస్సీఎస్సీ వాలంటీర్లకు ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ మరియు ఐటీ సంస్థల నుంచి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. *సైబరాబాద్ లో అత్యవసర సేవలకు 13 అంబులెన్స్ లను అందుబాటులో ఉంచామన్నారు.* అవసరం ఉన్నవారు ఈ సేవలను ఉపయోగించుకోవాలన్నారు. పోలీసులతో పాటు ఎస్సీఎస్సీ వలంటీర్లు ఇందుకు సహకరిస్తున్నారన్నారు.

ఎంతో మంది సమయానికి రక్తం దొరకక చనిపోతున్నారన్నారు. రక్తదానం చేయడం వల్ల ఒక కుటుంబాన్ని కాపాడిన వారిమవుతామన్నారు. మానవ సేవయే మాధవ సేవ అని నమ్మి.. థలసేమియా, రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు గాను రక్త సేకరణకు విన్నోతన ఆలోచన చక్కని వేధికను ఏర్పాటు చేసిన సైబరాబాద్ సిపి సజ్జనార్, ఐపి్‌ఎస్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెడికల్ ప్రతినిధి, మెడికల్ ఆఫీసర్ పిచ్చి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో థలసేమియా పేషంట్లకు రక్త కొరత ఉందన్నారు. ఈ బ్లడ్ డొనేషన్ వల్ల వారికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. అడిగిన వెంటనే బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటుకు సహకరించిన సైబరాబాద్ సిపి సజ్జనార్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ఏర్పాటు చేయాలన్నారు. ప్రజా సంక్షేమంలో భాగంగా పోలీసులు రక్తదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. బ్లడ్ డొనేషన్ చేసిన పోలీస్ సిబ్బంది, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. *ఈరోజు ఒక్కో వ్యక్తి నుంచి 300 ఎమ్ ఎల్ చొప్పున మొత్తం 117 యూనిట్ల రక్తాన్ని సేకరించామన్నారు.*

ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సిపి వీసీ సజ్జనార్, ఐపిక‌ఎస్., సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ సీఎస్ డబ్ల్యూ ఏడీసీపీ మాణిక్ రాజ్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రెటరీ (ఎస్సీఎస్సీ) జనరల్ సెక్రెటరీ కృష్ణ యేదుల, ఎస్సీఎస్సీ అసోసియేట్ డైరెక్టర్ పి చంద్రశేఖర్ రెడ్డి, సి‌టి‌సి డాక్టర్ సుకుమార్, ఆర్ఐ అరుణ్ కుమార్, ఆర్ఎస్ఐ ఫిలిప్ డోరాడో, ఏఆర్ సిబ్బంది, ఎస్సీఎస్సీ వలంటీర్లు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెడికల్ ఆఫీసర్ పిచ్చి రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ నరసింహా రెడ్డి, ఎస్సీఎస్సీ, ఐఆర్సీ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.