24/7 ‘సై’సై’ సైబరాబాద్ పోలీసులు

కరోనా వైరస్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ప్రజా రక్షణకు సైబరాబాద్ పోలీసులు 24/7 నిర్విరామంగా, అలుపెరుగని సైనికుల్లా కృషి చేస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో నివసిస్తున్న పేదలకు, వలస కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కమీషనర్ వీసీ సజ్జనార్ IPS ఆదేశాలతో స్వచ్ఛంద సంస్థలు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ , కార్పొరేట్‌ సంస్థలను భాగస్వాములను చేస్తూ సైబరాబాద్ LAW&ORDER పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు నిత్యం వేలాది మందికి నిత్యావసర సరకులను అందిస్తూ అన్నార్తుల ఆకలిని తీరుస్తున్నారు. కరోనా మహామ్మారి జాగ్రత్తల వివరణతో పాటు మాస్కులను ధరించుట, శుభ్రత, సామాజిక దూరం పాటించడం అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. మొయినాబాద్, మియాపూర్, దుండిగల్, నార్సింగి, ఆర్జీఐఏ, బాచుపల్లి తదితర పోలీస్ స్టేషన్ల సిబ్బంది ముమ్మర సహాయ చర్యలు చేపట్టారు. ఈ సహాయ చర్యలపై ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది.

మొయినాబాద్ PS పరిధిలో..
మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అజీజ్ నగర్, అందాపూర్ గ్రామాల్లో రాధాస్వామి సత్సంగ్ సహకారంతో ఇన్ స్పెక్టర్ జానయ్య సిబ్బందితో కలిసి 400 మందికి ఆహార పొట్లాలను అందజేశారు.

మియాపూర్ PS పరిధిలో..
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నడిగడ్డ తండా, సుభాష్ చంద్రబోస్ నగర్ వివిధ రంగాల్లో పని చేస్తున్న వలస అసంఘటిత కార్మికులకు TEA CARE NGO శిల్ప, రాం కుమార్ సహకారంతో ఈ రోజు మాదాపూర్ అడిషనల్ డిసిపి వెంకటేశ్వర్లు, ఏసీపీ మియాపూర్ కృష్ణ ప్రసాద్, మియాపూర్ ఇన్ స్పెక్టర్ వెంకటేష్, సిబ్బంది తో కలిసి బియ్యం ఇతర నిత్యావసర వస్తువులను అందజేశారు.

నార్సింగి PS పరిధిలో..
సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపిఎస్ సూచనల మేరకు నార్సింగి ఇన్ స్పెక్టర్ గంగాధర్ సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు, సబ్బులను అందజేశారు. అలాగే గంధంగూడ CAP foundation సహకారంతో 200 మంది దివ్యాంగులకు రేషన్ కిట్లను అందజేశారు. మరోవైపు నెక్నంపూర్, నార్సింగి ప్రాంతాల్లోని రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులను సామాజిక దూరం పాటించేలా క్యూలో నిలబెట్టారు.

దుండిగల్ PS పరిధిలో..
దుండుగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గండిమైసమ్మ ఎక్స్ రోడ్ లో దాతలు తారారామ్, మంగిలాల్ ల సహకారంతో ఇన్ స్పెక్టర్ వెంకటేశం, సిబ్బందితో కలిసి 50 మంది వలస కూలీలకు 10 రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేశారు.
ఆర్జీఐఏ ఆర్జీఐఏ పోలీసులు 1కాళి నడకన బయలుదేరిన 6 మంది వలస కూలీలను ఆల్వాల్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారికి వసతి ఏర్పాట్లు చేశారు.

చేవెళ్ళ PS పరిధిలో..
చేవెళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న పాలమూరు వలస కార్మికులకు చేవెళ్ల ఇన్ స్పెక్టర్ బాలరాజు ఆహార పొట్లాలను అందించడంతో పాటు కరోనా వైరస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాగే స్థానిక యూనిట్ ఆసుపత్రి వారి సహకారంతో సిబ్బందికి అవసరమైన ఔషధాలను అందజేశారు.