రోజూ కరోనాపై యుద్ధమే: సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనాపై రోజూ యుద్దం చేయాల్సిందే మహామ్మారిని కట్టడి చేయాల్సిందేనని పిలుపునిచ్చారు. ఏపీలో కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. ఈ జిల్లాల్లో కరోనా పరీక్షలు, జాగ్రత్త చర్యలకు
అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. మాస్క్‌ల పంపిణీ ఊపందుకుందన్న, మాస్క్‌లను రెడ్, ఆరెంజ్‌ జోన్లకు ముందు పంపిణీ చేయాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా టెస్టులు వేగం. పెంచుకున్నాయి, విశాఖపట్నంలో అత్యధికంగా టెస్టులు చేస్తున్న విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కేసులు నమోదుకాలేదనడం ఊరటనిచ్చే విషయం. ట్రూనాట్‌ కిట్స్‌ ద్వారా ఇక్కడ కూడా పరీక్షలకు ఏర్పాట్లు చేశామన్న అధికారులు 225 ట్రూనాట్‌ కిట్స్‌తో విస్తారంగా పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. ఏప్రిల్20 ఒక్కరోజే రాష్ట్రంలో 5022 కోవిడ్‌-19 పరీక్షలు (ర్యాపిడ్‌ టెస్టులు కాకుండా) నిర్వహించారు.

కర్నూలు ప్రభుత్వ GGHను రాష్ట్ర కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. గవర్నమెంట్‌ ఆస్పత్రిలో ఉన్న వారిని మిగతా ఆస్పత్రులకు మార్చామని ఆదేశాలు ఇచ్చారు. ప్లాస్మా థెరఫీని ప్రారంభించడానికి అధికారులు అనుమతి కోరారు. పీపీఈలను, మాస్క్‌లను కూడా అవసరాలకు అనుగుణంగా ఉంచాలని, కేసులు ఎక్కువగా నమోడవుతోన్న ప్రదేశాల్లో టెస్ట్ కిట్ల స్టాక్‌ను అధికంగా ఉంచాలని నిర్ణయించారు. ఇంటింటికి సమగ్ర సర్వేల ద్వారా గుర్తించిన 32వేలమందిలో ఇప్పటికే 2వేలకుపైగా పరీక్షలు చేశామని అధికారులు ముఖ్యమంత్రి తెలిపారు. మిగతావారికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్వారంటైన్‌ సెంటర్లలో ఇప్పటివరకూ 7100 మంది ఉన్నారు.

రాష్ట్రంలో పంటలకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు వెంటనే చర్యలు తీసుకోవడంలో ఆలశ్యం చేయరాదన్నారు. మార్కెట్లలో రైతుల ధాన్యాన్ని దూకుడుగా కొనుగోళ్లు జరపాలి, రైతులకు అండగా నిలబడాలి. దీనివల్ల చిన్న సమస్యలు ఉన్నా కూడా సమసిపోయేల చర్యలుండాలని CM ఆదేశించారు.

లాక్‌డౌన్‌ సందర్భంగా గుజరాత్‌లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులకోసం గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీతో CM జగన్ తెలుఫోనులో మాట్లాడారు. అన్నిరకాలుగా ఆదుకుంటామని, వెంటనే అధికారులకు ఆదేశాలిస్తానని ఆ రాష్ట్ర సీఎం జగన్మోహన్ సంభాషణలో తెలిపారని అధికారులకు వివరించారు.

ఈ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి హాజరయ్యారు.