కరోనా పరిశోధన కన్సార్టియం/ఆర్థిక సహాయం

కోవిడ్-19 పరిశోధనా కన్సార్టియం ఏర్పాటు కోసం బయోటెక్నాలజీ శాఖ మరియు బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ దరఖాస్తులు ఆహ్వానించాయి.

దరఖాస్తుల స్వీకరణకు మొదటి దశ 2020 మార్చి 30వ తేదీ నాటికి పూర్తి కాగా, 500 దరఖాస్తులు విద్యా, పరిశ్రమల రంగాల నుండి వచ్చాయి. వివిధ దశల్లో సమీక్షా ప్రక్రియ కొనసాగుతోంది. ఐతే డివైజెస్, డయాగ్నోస్టిక్స్, వాక్సిన్ వంటి ఇతర జోక్యాలలో నిధుల సహాయం అందించడానికి 16 ప్రతిపాదనలను సిఫార్సు చేయడం జరిగింది.

నేషనల్ బయో ఫార్మా మిషన్ నుండి ఆర్ధిక సహాయం కింద టీకా అభ్యర్థులు వేర్వేరు వేదికలను ఉపయోగించుకునేలా, వివిధ దశలలో వేగంగా అభివృద్ధి చెందేలా చూస్తూ, బహుముఖ విధానాన్ని అవలంబిస్తున్నారు. అధిక ప్రమాద సమూహాల యొక్క తక్షణ రక్షణ కోసం ఇప్పటికే ఉన్న టీకాలను తిరిగి ఉపయోగించడం, నూతన టీకా అభివృద్ధి,
ఈ రెండు ప్రతిపాదనలను, ఈ కాల్ కింద ఎంచుకునేటప్పుడు పరిగణించడం జరిగింది. నోవెల్ కరోనా వైరస్ సార్స్-కోవ్-2 కి వ్యతిరేకంగా ఒక డి.ఎన్.ఏ. టీకా ను అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కాడిలా హెల్త్ కేర్ లిమిటెడ్ సంస్థకు, అదేవిధంగా క్రియాశీలంగా లేని రేబిస్ వెక్టార్ వేదికను వినియోగించుకుని కోవిడ్-19 టీకాను అభివృద్ధి చేసేందుకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థకు ఆర్ధిక సహాయం చేయడానికి సిఫార్సు చేయబడింది. వీటికి అదనంగా, ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్న జనాభాలో మూడవ దశ మానవ క్లినికల్ పరీక్ష కోసం బి.సి.జి. టీకా (వి.పి.ఎమ్.1002) తిరిగి కలిపే ప్రణాళికను అధ్యయనం చేయడానికి సీరం ఇన్ స్టిట్యూట్ అఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్.ఐ.ఐ.పి.ఎల్.) సంస్థకు సహకరించాలని నిర్ణయించారు. నోవెల్ టీకా పరిణామ వేదిక అభివృద్ధికీ, సార్స్-కోవ్-2 టీకా అభివృద్ధికీ నేషనల్ ఇన్ స్టిట్యూట్ అఫ్ ఇమ్మ్యూనోలజీ కి ఆర్ధిక సహాయం అందజేయాలని కూడా ఆమోదించారు.

కోవిడ్-19 సోకినా రోగి చికిత్స కోసం భారీ స్థాయిలో – కోవిడ్-19 కన్వల్సెంట్ సెరా నుండి వాణిజ్య సరళిలో శుద్ధి చేసిన ఇమ్మ్యూనోగ్లోబులైన్ జి. ఐ.జి.జి. ఉత్పత్తి మరియు ఈక్విన్ హైపర్ ఇమ్యూన్ గ్లోబులైన్ యొక్క హై టైటెర్స్ ఉత్పత్తి కోసం విర్కో బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఆర్ధిక మద్దతు ఇస్తున్నారు. ఇన్ విట్రో లంగ్ ఆర్గానోయిడ్ మోడల్ తయారుచేయడం కోసం ఓన్ కో సీక్ బయో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఆర్ధిక సహాయం అందిస్తున్నారు.

మోలెక్యూలర్ & రాపిడ్ డయాగ్నొస్టిక్ పరీక్షల దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికీ, ఉత్పత్తి స్థాయిని పెంపొందించడానికీ దిగువ పేర్కొన్న కంపెనీలకు ఆర్ధిక సహాయం లభిస్తుంది.
1. మైలాబ్ డిస్కవరీ సోలుషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
2. హువెల్ లైఫ్ సైన్సెస్
3. యుబియో బయోటెక్నాలజీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్
4. ధితి లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్
5. మాగ్ జీనోమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్
6. బిగ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్
7. యాతుమ్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్

డయాగ్నొస్టిక్ కిట్లు మరియు వెంటిలేటర్లు తయారుచేయడానికి వీలుగా సాధారణ భాగస్వామ్య సౌకర్యాలను డి.బి.టి. కి చెందిన నేషనల్ బయో ఫార్మా మిషన్ కింద ఆంధ్రప్రదేశ్ మెడ్ టెక్ జోన్ (ఏ.ఎం.టి.జెడ్.) లో ఏర్పాటుచేస్తారు. వేర్వేరు ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంపొందించుకోడానికి ఇక్కడ అవకాశం కల్పిస్తారు.

కోవిడ్-19 అనుమానితులను స్క్రీనింగ్ టెస్ట్ చేయడానికి అవసరమయ్యే చేతులతో ముట్టుకోకుండా, తక్కువ ధరకు లభించే థెర్మో పైల్ ఆధారిత అల్ట్రాసోనిక్ సెన్సార్లు మరియు ఆరోగ్య రక్షణ నిపుణులకు ఉపయోగపడే నావెల్ పి.పి.ఈ. ల దేశీయ ఉత్పత్తి, అభివృద్ధి, విస్తరణకు కూడా ఆర్ధిక సహాయం లభిస్తుంది.