USAలో కనీసం ఖననం కష్టాలు

ప్రపంచంలోనే No1 దేశం, అత్యంత ఖరీదైన No1 నగరం న్యూయార్క్ సిటీలో కనీసం ఖానానికి అవకాశం లేకుండా పరిస్థితులు చేజారీ పోయాయి. కరోనా మహామ్మారి కారణంగా మృత్యువాత పడిన వ్యక్తులను ఖననం చేసేందుకు శ్మశానవాటికలు కిక్కిరిసిపోతున్నాయి. కరోనా మరణాలతో కలలో కూడా ఊహించని దారుణ పరిస్థితులు దాపురించాయి.

దీంతో తాత్కాలిక శవాగారాల్లో మృతదేహాలు పెట్టుకుని విలవిలలాడుతున్నారు. కరోనా విజృంభణ ప్రపంచవ్యాప్తంగా ఉండటంతో అమెరికా, స్పెయిన్‌, బ్రిటన్‌లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. 7ఖండాల్లోని దేశాలన్నీ కరోనాతోగజగజ వణికిపోతున్నాయి. దాదాపు 11లక్షలకు కరోనా కేసుల సంఖ్య నమోదవుతోంది. ఈ వైరస్‌ నివారణకు క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నప్పటికీ 2020 చివరికి ఓ స్పష్టమైన ఫలితాలు తెలిసే అవకాశాలున్నాయి. USAలో
24 గంటల్లో మరణాల సంఖ్య వెయ్యికి పైగా, స్పెయిన్‌లో 900 మందికిపైగా, బ్రిటన్‌లో ఒక్కరోజులోనే 569 మంది మృత్యువాత పడ్డారు.

అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య 50వేలు పైనే ఉండగా మరణాలు మాత్రం 1500 దాటేశాయి. అంతేకాకుండా 11 వేల మంది చికిత్స కోసం క్యూలో ఉన్నారు. రోజురోజుకీ కరోనా కోరల్లో మృత్యువాత పడుతోన్న నమోదు పెరగడంతో మృతదేహాల ఖననానికీ కనీసం సౌకర్యాలు లేకుండా కరువయ్యాయి. శ్మశాన వాటికలు దారుణంగా జనాలతో తండోపతండాలుగా దర్శనమిస్తున్నాయి. స్మశాన వాటికల నిర్వాహకులకు మృతుల బంధువుల నుంచి భారీగా ఫోన్లు, ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. దీంతో స్మశాన వాటికలు ఖాళీ లేపోవడంతో ఆసుపత్రుల్లోనే ఉంచుకుని కుటుంభ సభ్యులు, బంధువులు రోధిస్తున్నారు.

అమెరికాలోని బ్రూక్లిన్‌ శ్మశానవాటికలో 40 నుంచి 60 మృతదేహాలను ఖననం చేయడానికి వీలుండగా ఒక్కరోజే 185 మృతదేహాలు వచ్చాయి. ఇలాంటి దీన పరిస్థితుల్లో అమెరికాలోని స్మశాన వాటికల్లో మృతదేహాలకు లేపనాలు రాసి ACల్లో తాత్కాలికంగా భద్రపరురుస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికాలోనే ఇలాంటి పరిస్థితులు ఎదురావుతున్నాయంటే మన భారతదేశం మన భారతీయులు ఇదో గుణపాఠంలా భావించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను, నియమ నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూ STAY HOME SAFE HOME, సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి. లేదంటే భవిష్యత్ పరిణామాలు భగవంతునికే తెలియాలి.