కరోనాపై కూచిపూడి నృత్యం

జాతీయ సంగీత నాటక అకాడమి బిరుదాంకితురాలు
దీపికా రెడ్డి ఈనాటి కూచిపూడి నాట్య రంగములో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న నృత్య కళాకారిణి. ఆమె తన నృత్య పయనాన్ని 47 సంవత్సరాల క్రితం 1976లో రంగప్రవేశం జరిగింది. అలాగే ఆమె సృజనాత్మకమైన నృత్య రచయిత, సాంస్కృతిక రాయబారి మరియు ఓ అంకితభావంతో విద్యను అందించే గురువు.

కూచిపూడి నాట్యరంగ ప్రముఖులైన పద్మ భూషణ్ బిరుదాంకితులు డాక్టర్ వెంపటి చిన్నసత్యం శిక్షణలో కూచిపూడి నాట్యాన్ని అవపోసన పట్టిన నాట్య విధుషీమణి దీపికరెడ్డి.

మనదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ సంగీత నాటక అకాడమి బిరుదుని భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా రాష్ట్రపతి భవనులో 6 ఫిబ్రవరి 2019లో అందుకున్నారు. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత పురస్కారాన్ని ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే ప్రతిష్టాత్మకమైన కృష్ణ గాన సభ వారి “నృత్య చూడామణి”, పార్థసారథి స్వామి సభ “నాట్య కళాసారధి”, త్యాగబ్రాహ్మగానసభ “వాణి కళా సుధాకర”, “అక్కినేని నాగేశ్వర రావు స్వర్ణకంకణం” మొదలైన బిరుదులను అందుకున్నారు.

దీపికా రెడ్డి అంతర్జాతీయ నృత్యోత్సవాల్లో పాల్గోని ప్రేక్షకుల మన్ననలను పొందారు. బర్లిన్ లో భారత ప్రధాన మంత్రి సమక్షములో “Festival of India” ముగింపోత్సవంలో, భారత రాష్ట్రపతి భవన్ లో రష్యా రాష్ట్రపతి సమక్షములో , శ్రీలంక శాసనసభలో , రష్యాలోని బొల్షోయి థియేటర్ లో “Year of India” ప్రారంభోత్సవనృత్యం , జపాన్ లోని హీరోషిమా లోను ప్రదర్శన లిచ్చి ఆ దేశపు గౌరవ సభ్యత్వాన్ని పొందారు. బ్యాంకాక్ అంతరాష్ట్రీయ ఉత్సవము లో ; కొరియా లోని Jeonjhu Soru అంతరాష్ట్రీయ ఉత్సవములోనూ , ఫ్రాన్స్, సెర్బియా, టర్కి, సింగపూరు, ఇండోనేషియా, జర్మని, అమెరికా దేశాలలోను కూడా ఎన్నో నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరి అభిమానం పాందారు. పండిత్ బిర్జు మహారాజ్ గారు నిర్మించిన “ఋతు సంహార” నృత్య నాటికలోని కూచిపూడి నృత్య భాగాన్ని సమకూర్చి వారితో సౌత్ కొరియా మరియు థాయ్లెండ్ దేశాలలో విస్తారంగా పర్యటించి ఎన్నో నృత్య ప్రదర్శనలను ఇచ్చినారు. అంతే కాక వారు దూర దర్శన్ కేంద్రం ద్వారా “A- టాప్ గ్రేడ్” ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందారు.

గతంలో “రాష్ట్ర చలన చిత్ర సెన్సర్ బోర్డు సభ్యురాలిగా,
నంది అవార్డుల కమిటీ సభ్యురాలిగా మరియు 2011 అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలలో సాంస్కృతిక కమిటీ అధ్యక్షురాలిగా మహోన్నత సేవలు అందించారు.

కూచిపూడి నృత్య శాస్త్రాన్ని రాబోయే తరాలకు అందించాలనే సదాశయంతో “దీపాంజలి” నృత్య కళాశాలను స్థాపించి వందల మంది శిష్యులకు నాట్య శిక్షణ ఇస్తున్నారు. దీపాంజలి ప్రదర్శనలు అభిమానుల మరియు విమర్శకుల మన్ననలను పొందాయి. తన అభినయ కౌశల్యంతో ద్రౌపది, మండోదరి, సావిత్రి, సీత , దాక్షాయణి, కైకైయి, రుద్రమ లాంటి స్త్రీ ప్రధాన పాత్రలకు జీవం పోసి ప్రేక్షకుల ఆదరాభిమానాలను చురగోన్నారు శ్రీమతి దీపికా రెడ్డి.

కూచిపూడి డాన్సర్ దీపికా రెడ్డి కరోనా మహామ్మారి మృత్యు తాండవంపై ఆవేదన చెందుతూ వైరస్ అవగాహణపై ఓ కళానృత్యం రూపొందించారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తులకు వైద్యం అందిస్తోన్న డాక్టర్లపై దౌర్జన్యం జరుగుతుండటంతో చలించిన దీపికా రెడ్డి కుమార్తె శ్లోక రెడ్డితో కలిసి క్వారంటైన్ లోనే ఉంటూ ఇంట్లో ఓ నృత్య రూపకాన్ని ప్రజల సంక్షేమం కోసం రూపొందించారు. దీపికా రెడ్డి నాట్యం చేస్తూ సమజాహితం కోసం చేసిన ప్రదర్శన వీడియో మీ కోసం