మెడికల్ ఎమెర్జెన్సీలో మేమున్నాం…రక్షణ దళం

కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో పౌర యంత్రాంగానికి సహకరించడంలో రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. రక్షణ మంత్రిత్వ శాఖ అధీనంలోని రక్షణ ఉత్పత్తుల శాఖకు చెందిన ఈ కీలక సంస్థలన్నీ తమ వద్ద ఉన్న వనరులు, సాంకేతిక పరిజ్ఞానం, మానవ వనరులు అన్నింటినీ ఈ ప్రాణాంతకమైన వైరస్ పై పోరాటానికి మోహరించాయి. ఆయా సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు, సిబ్బంది చేసిన ప్రయత్నాలతో లభించిన ఫలాల్లో కీలకమైనవి ఇలా ఉన్నాయి.

బెంగళూరుకు చెందిన హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మూడు ఇంటెన్సివ్ కేర్ పడకలు, 30 వార్డు పడకలతో కూడిన ఒక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసింది. అలాగే 30 పడకలతోఒక భవనం కూడా అందించింది. ఈ వసతిలో ఒకేసారి 93 మందికి చికిత్స చేయవచ్చు. కోవిడ్-19 చికిత్స కోసం సేవలందిస్తున్న వైద్యుల కోసం 25 పిపిఇలు కూడా పంపిణీ చేసింది. బెంగళూరు, మైసూరు, ముంబై, పూనే, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఆస్పత్రులకు 160 ఏరోసోల్ బాక్స్ లు కూడా అందించింది.

భారత్ ఎలక్ర్టానిక్స్ లిమిటెడ్ (బిఇఎల్) ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశంపై రెండు నెలల కాలంలోనే దేశంలోని ఆస్పత్రుల్లో ఐసియుల కోసం డిఆర్ డిఓ అందించిన నమూనాలో 30 వేల వెంటిలేటర్లు తయారుచేసి అందించేందుకు ముందుకు వచ్చింది. వాటి తయారీ ఏప్రిల్ 20-24 తేదీల మధ్యన ప్రారంభమవుతుంది.
బిడిఎల్ పూణెలోని ఒక ప్రైవేటు స్టార్టప్ సహకారంతో ఒక వెంటిలేటర్ నమూనా రూపొందిస్తోంది. ఈ వెంటిలేటర్ ను మే నెల మొదటి వారంలో పరీక్షించి సర్టిఫై చేసిన అనంతరం దాని ఉత్పత్తి ప్రారంభం అవుతుంది.

భారీ ఎత్తున వెంటిలేటర్ల తయారీ కృషిలో బిఇఎల్ భాగస్వామి అవుతోంది. అలాగే భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బిఇఎంఎల్) మైసూరుకు చెందిన స్కాన్రే కంపెనీ వెంటిలేటర్ల తయారీలో ఉపయోగించేందుకు 25 సెట్లతో కూడిన 5 విడి భాగాలు తయారుచేసి ఇచ్చింది.

దేశంలో 40 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు 3 రకాల ఎక్స్ పోజర్లలో ఉపయోగించేందుకు వీలుగా ఐఎస్ఓ ప్రమాణాలతో కూడిన కవరాల్ ల సరఫరా ప్రారంభించింది. హెచ్ఎల్ఎల్ కోసం 1.10 లక్షల ఆర్డర్ 40 రోజుల్లో పూర్తి చేసే లక్ష్యంతో తయారీ కార్యకలాపాలు ప్రారంభించింది. కాన్పూర్, షాజహాన్ పూర్, హజ్రత్ పూర్, చెన్నైలలోని 5 ఆర్డినెన్స్ పరికరాల గ్రూప్ ఫ్యాక్టరీలు ఈ కవరాల్ ల తయారీలో ఉన్నాయి. కవరాల్, మాస్క్ ల సమర్థతను పరీక్షించేందుకు మూడు యంత్రాలను కూడా రూపొందించింది. ఒఎఫ్ బి 5870 పిపిఇలు తయారుచేసి తమ సొంత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలకు, హెచ్ఎల్ఎల్, సిఎంఓ, ఫిరోజాబాద్ కు అందచేసింది.

మెడికల్ ఎమర్జెన్సీ, స్క్రీనింగ్, హాస్పిట్ ట్రయేజ్, క్వారంటైన్ అవసరాల కోసం రెండు మీటర్ల విస్తీర్ణం గల ప్రత్యేక గుడారాలు కూడా సిద్ధం చేసింది. ఇవి పూర్తిగా వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్, తేలికపాటి స్టీల్, అల్యూమినియం అల్లాయ్ తో తయారుచేసింది. వాటి సరఫరా కూడా ఇప్పటికే ప్రారంభం అయింది. అంతే కాదు వెంటిలేటర్ల మరమ్మత్తు కార్యకలాపాలు కూడా చేపట్టి ఇప్పటి వరకు టిఎస్ఐఎండిసి, తెలంగాణ కోసం 53 వెంటిలేటర్లు మరమ్మత్తు చేసి ఇచ్చింది.

– ప్రస్తుతం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు హెచ్ఎల్ఎల్ నుంచి 28 వేల లీటర్ల ఆర్డర్ లో భాగంగా 7500 లీటర్ల శానిటైజర్ తయారుచేస్తోంది. ఇప్పటివరకు దేశంలోని వివిధ హెచ్ఎల్ఎల్ యూనిట్లకు 60,230 లీటర్ల శానిటైజర్లు తయారుచేసి ఒఎఫ్ బి పంపిణీ చేసింది. అలాగే రక్తం నమూనాల పరీక్షకు రెండు లాబ్ లు కూడా ఏర్పాటు చేసింది.

ఒఎఫ్ బి ఇప్పటివరకు 1,11,405 మాస్క్ లు తయారుచేసింది. వాటిలో 38,520 త్రీ ప్లై మెడికల్ మాస్క్ లు కూడా ఉన్నాయి.