ఢిల్లీలో పిజ్జా డెలివరీ ఉద్యోగికి సోకిన కరోనా

దేశ రాజధానిలో “పిజ్జా” డెలివరీ బాయ్ “కరోనా” పాజిటివ్ రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో 72 కుటుంబాలను “సెల్ఫ్ క్వారైంటైన్” లోకి వెళ్లాల్సిందిగా ఢిల్లీ అధికారులు ఆదేశించారు. ప్రముఖ “ఫుడ్ సప్లయి” సంస్థకు చెందిన “డెలివరీ బాయ్” ఈ కరోనా వైరస్ మహామ్మారి సోకిందని అధికారులు గుర్తించారు. “డెలివరీ బాయ్” తో పనిచేసే 16 మంది సహచరులకు కూడా “కరోనా” నిర్దారణ పరీక్షలు చేస్తున్నారు. దక్షిణ ఢిల్లీలోని మాల్వియ నగర్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.