ఢిల్లీలో ప్రయాణంకు అనుమతి

ఢిల్లీలో వలస కూలీలకు సొంత ఊర్లకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో ISBT ఏరియాల్లో జన సందోహం నెలకొంది. ఆనంద్ విహార్ ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ అడ్డా ముందు వేలాది మంది లేబర్స్ బస్సుల కోసం పడిగాపులు గాస్తున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన లేబర్స్ ఢిల్లీ నుంచి ఊళ్లకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఢిల్లీ నుంచి వెళ్ళడానికి బస్సులు, ట్రైన్స్ నిలిపేసిన నేపథ్యంలో ఇబ్బందులు ప్రయాణం చేసేందుకు మార్గం లేక బస్ స్టేషన్ ముందు జనాలు గుమికూడుతున్నారు. చాలా మంది నడకా ద్వారా వెళ్తున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ , లక్నో, ఖానాపూర్, బీహార్, పాట్నా ఇంకా చాలా ప్రాంతలకు వెళ్లే జనం తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక జనాలు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వైరస్ ఇంకా ఎక్కువ అయ్యే ప్రమాదం కనబడుతోంది ఎక్కడా కూడా జనాలు సామాజిక దూరం పాటించడం లేదు. NDRF సిబ్బంది జనాలకు అవగాహన కలిపిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం 1000 బస్సుల్లో స్వస్థలాలకు పంపడానికి ఏర్పాట్లు చేసింది.