అల్లు అర్జున్‌కి ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన దేవిశ్రీ‌

అల్లు అర్జున్‌కి ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన దేవిశ్రీ‌

సినీ న‌టుడు అల్లు అర్జున్ త‌న‌కు ఓ ప్ర‌త్యేక బ‌హుమ‌తి పంపాడ‌ని సినీ సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్ర‌సాద్ తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయ‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అల్లు అర్జున్‌కి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ఆయ‌న‌పై తనకున్న ఇష్టాన్ని తెలిపాడు. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నుంచి సర్‌ప్రైజ్‌ ‘రాక్‌స్టార్‌’ గిఫ్ట్ అందింద‌ని పేర్కొన్నాడు.ప్రియ‌మైన సోద‌రుడు బన్నీకి కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాన‌ని ట్వీట్ చేశాడు. ఇది లవ్లీ గిఫ్ట్ అని త‌న‌కు బ‌న్నీ పంపిస్తాడ‌ని అస్సలు ఊహించలేదని తెలిపాడు. బన్నీ చాలా స్వీట్ అని ఆయ‌న చెప్పాడు. కాగా, బన్నీ నటించిన రెండో సినిమా ‘ఆర్య’ నుంచి ప్ర‌స్తుతం న‌టిస్తోన్న ‘పుష్ప’ వ‌ర‌కు అనేక చిత్రాల‌కు దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందించాడు.