విజయవాడ దుర్గమ్మకు ఏడువారాల వజ్రాల నగలు సమర్పించిన భక్తుడు

విజయవాడ దుర్గమ్మకు ఏడువారాల వజ్రాల నగలు సమర్పించిన భక్తుడు

విజయవాడ దుర్గమ్మకు ఓ భక్తుడు భారీగా కానుకలు సమర్పించాడు. విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడు రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలను అందించాడు. దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు వాటిని అందించి, ఆయన కుటుంబం ఆశీర్వాదం తీసుకుంది. అమ్మవారికి ప్రతి గురువారం నగలను అలంకరిస్తామని ఆలయ పండితులు తెలిపారు.కాగా, విజయవాడ దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలను కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహిస్తున్నారు. దేవి శరన్నవరాత్రులలో భాగంగా కనకదుర్గ అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించారు. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నిన్న మెదక్‌ జిల్లా ఏడుపాయలలో వన దుర్గామాతలు బ్రహ్మచారిణిగా, ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీ లక్ష్మీ తాయారు ఆలయంలో అమ్మవారు సంతానలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు.