బరువు త‌గ్గాలా? ఫాలో కీటో డైట్

బరువు త‌గ్గాలా? ఫాలో కీటో డైట్

ప్ర‌పంచీక‌ర‌ణ నేప‌థ్యంలో దాదాపు 80% ప్ర‌జానీకం ఎదుర్కొంటున్న స‌మ‌స్య అధిక బరువు… త‌మ శ‌రీర బ‌రువుని ఏ విధంగా త‌గ్గించుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటారు. కొంత‌మంది ఉపవాసాలు, మ‌రికొంత ప‌స్తులు ఉండ‌టం చేస్తుంటారు. అయితే, ఇటువంటి అశాస్త్రీయ ప‌ద్ధ‌తుల వ‌ల్ల లాభం కంటే నష్ట‌మే అధిక‌మని అంటున్నారు నిపుణులు. అయితే, మ‌రి సొల్యూష‌న్ ఏంట‌ని ఆలోచిస్తున్నారా? కీటో డైట్‌… ప్ర‌స్తుతం
ఏ ఎక్స్‌ప‌ర్ట్ అయినా ఇదే సూచిస్తున్నారు. అదేంటో చూద్దాం.

సాధారణంగా బరువు తగ్గటానికి మనం చాలా రకాల డైట్ గురించి వినే ఉంటారు. కానీ, ఈ మధ్య తరచుగా వినిపిస్తున్న పేరు కీటో డైట్. ఈ మధ్యకాలంలో కీటోడైట్ ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలుసు. ఇప్పటికే చాలా మంది ఈ డైట్ ద్వారా ద్వారా లాభాలు పొందుతున్నామని చెబుతున్నారు. కీటోజెనిక్‌ ఫుడ్‌ను తీసుకుంటే… కొవ్వుని దానంతట అదే తగ్గిపోతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల బరువు తగ్గడం మాత్రమే కాకుండా… అధిక బరువుతో వచ్చే ఆరోగ్య సమస్యలు అంటే… డయాబెటిస్, క్యాన్సర్‌ వంటివాటికీ ఇది సమర్థంగా పనిచేస్తుందని చెబుతుంటారు. అయితే బెనిఫిట్స్ గురించి ఎలా చెబుతున్నారో.. దీని వల్ల వచ్చే సమస్యల గురించి కూడా అదే చెబుతున్నారు.

తినాల్సిన ఆహార ప‌దార్థాలు
కీటో డైట్‌ని పాటించే వారు కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న మాంసం, చేపలు, నూనె పదార్థాలు, జున్ను, తక్కువ కార్బొహైడ్రేట్లు ఉన్న కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. అదే విధంగా, బ్రెడ్, పాస్తా, వరి అన్నం, ధాన్యాలు, పండ్లు, బంగాళాదుంప లాంటి పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న కాయగూరలను తక్కువగా తీసుకోవాలి.

ఇబ్బందులేంటీ?
చాలా వరకు కీటో–డైట్‌ అనేది చాలా మంచిది. అయితే, ఈ డైట్‌ ప్రారంభ దశలో కనిపించే దుష్ప్రభావాలూ, వాటి వల్ల కలిగే అనారోగ్యాలను ‘కీటో–ఫ్లూ’ అని అంటారు. కీటో–ఫ్లూ ఉన్నప్పుడు బాడీకి శక్తి ఉన్నట్లుగా అనిపించదు. ఎందుకంటే, మెదడుకు అవసరమైన శక్తి అందదు. దాంతో ఎప్పుడూ ఆకలిగా ఉన్నట్లు అనిపించడం, నీరసం, నిద్రవస్తున్నట్లుగా ఉండటం, వికారం, జీర్ణవ్యవస్థలో ఇబ్బంది, మునుపటిలా వ్యాయామం చేయలేకపోవడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయి. ఇవి తగ్గేవరకు మొదట్లో ఒకటి, రెండు వారాలు చాలా తక్కువ మోతాదుల్లో కార్బోహైడ్రేట్స్ తీసుకుంటుంటే మంచిది. అలా వాటిని తగ్గిస్తూ క్రమంగా ఒంట్లోని కార్బోహైడ్రేట్స్‌కి బదులు కొవ్వుని ఖర్చు చేసేలా శరీరాన్ని అలవాటు చేయాలి. అయితే, కొన్నాళ్లలోనే ఈ కీటో–ఫ్లూ తగ్గిపోతుందని ఓ అధ్యయనం పేర్కొంది. ఈ పరిశోధన ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రిషన్‌లో ప్రచురించారు.

ఈ అధ్యయనం చేసిన పరిశోధకులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ లలో అనేక కీటో డైట్ అనుచరులు కొన్ని లక్షణాలను విశ్లేషించారు. నివేదిక ప్రకారం, అలసట, వికారం, మైకం, శక్తి తగ్గడం, మూర్ఛ అనుభూతి, హృదయ స్పందన మార్పులు వంటి కొన్ని సాధారణ లక్షణాలు ఉన్నాయి. ఆన్‌ లైన్ సాక్ష్యాలు, ఏఎన్ఐ కథనం ప్రకారం, ఈ లక్షణాలు మొదటి ఏడు రోజులలో గరిష్ట స్థాయిలో ఉంటాయని, నాలుగు వారాల తరువాత తగ్గిపోతాయని చెబుతున్నారు.

ప‌రిశోధ‌కులు ఏం చెబుతున్నారు?
“కెటోజెనిక్ డైట్ ప్రారంభించిన తర్వాత చాలా మంది ఈ లక్షణాలు అనుభవించినట్లు ఆధారాలు బలపరుస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ డైట్ ను అనుసరించిన వారు తక్షణమే ప్రభావాలు, దుష్ప్రభావాల గురించిన అనుభవం ఉంది. చాలామంది ఆన్‌లైన్ ఫోరమ్‌లలో వీటిగురించి తమ అనుభవాలను పంచుకుంటున్నారు.

కీటో ఫ్లూ అనేక దుష్ప్రభావాలలో ఒకటి. ఈ డైట్ అనుసరించిన మొదటి కొన్ని వారాల్లో సంభవించే అస్థిరమైన లక్షణాలు సంభవిస్తాయి. ఈ లక్షణాల గురించి బాగా అర్థం చేసుకోవడానికి, పరిశోధకులు ‘కీటో ఫ్లూ’ని సూచించే 43 ఆన్‌ లైన్ ఫోరమ్‌ లను గుర్తించారు. లక్షణాలను వివరించే 101 మంది వ్యక్తుల వ్యక్తిగత అనుభవాలను సేకరించారు. ఈ డైట్ యొక్క తీవ్రత, కోర్సు టైమ్ గురించి అడిగి తెలుసుకున్నారు.

అధ్యయనం తరువాత, డైటర్స్ ఎదుర్కొన్న సాధారణ ఫ్లూ లక్షణాలు ఏంటంటే తలనొప్పి, ఏకాగ్రతలోపం, జీర్ణశయాంతర అసౌకర్యం, ఫ్లూ, అలసట, వికారం, మైకం, శక్తి తగ్గడం, మూర్ఛ, హృదయ స్పందన మార్పులు అని పరిశోధకులు వివ‌రిస్తున్నారు.

ఈ డైట్ అనుసరించిన కొత్తలో కొన్ని లక్షణాలు కనపడతాయని మొదటి స్థానానికి చేరుకోవడం, నాలుగు వారాల తర్వాత ఈ లక్షణాలు తగ్గిపోతాయని వివరించారు. డైట్ ఫాలో అయి ఈ లక్షణాలు స్పష్టంగా కనిపించిన తర్వాత, వాటిలో ఎక్కువ భాగం రెండు వారాలలోపు పరిష్కరించబడతాయని మెట‌బాలిజం నిపుణులు చెబుతున్నారు.