కరోనాలో డిజిటల్ ప్లాట్ ఫామ్…

నా ప్రియమైన దేశ వాసులారా! 130 కోట్ల మంది దేశవాసుల ఈ మనోభావానికి తల వంచి నమస్కరిస్తున్నాను. మీ ఆలోచన ప్రకారం, దేశం పట్ల మీకున్న ఆసక్తి మేరకు, మీ సమయానుసారం మీరు ఏదైనా చేసేందుకు వీలుగా ప్రభుత్వం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను కూడా సిద్ధం చేసామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మనస్సులో మాట సందర్భంగా అన్నారు.

ఈ వేదిక – covidwarriors.gov.in . మరోసారి చెప్తున్నాను covidwarriors.gov.in ఈ వేదిక ద్వారా ప్రభుత్వం అన్ని సామాజిక సంస్థల వాలంటీర్లను, పౌర సమాజ ప్రతినిధులను, స్థానిక పరిపాలనను అనుసంధానించింది. చాలా తక్కువ సమయంలో, 125 మిలియన్ల మంది ఈ పోర్టల్‌లో చేరారు. డాక్టర్, నర్సుల నుండి మన ASHA, ANM సోదరీమణులు, NCC, NSS భాగస్వాములు, వివిధ రంగాలకు చెందిన నిపుణులందరూ ఈ వేదికను తమ వేదికగా చేసుకున్నారు.

ఈ వ్యక్తులు స్థానికంగా సంక్షోభ నివారణ ప్రణాళికలను రూపొందించడంలో, అమలు చేయడంలో చాలా సహాయం చేస్తున్నారు. మీరు కూడా covidwarriors.gov.in లో చేరి దేశానికి సేవ చేయవచ్చు. కోవిడ్ వారియర్ కావచ్చు.

ఆరోగ్య సేతు యాప్ కూడా అందరూ వినియోగిస్తున్నారు.

మిత్రులారా! ప్రతి కష్టమైన పరిస్థితి, ప్రతి పోరాటం, కొన్ని పాఠాలు నేర్పిస్తుంది. కొన్ని అవకాశాలకు మార్గం సుగమం చేస్తుంది. కొన్ని గమ్యాలకు దిశానిర్దేశం చేస్తుంది. ఈ పరిస్థితిలో దేశవాసులందరూ చూపించిన సంకల్ప శక్తితో భారతదేశంలో కూడా కొత్త మార్పు ప్రారంభమైంది. మన వాణిజ్యం, మన కార్యాలయాలు, మన విద్యాసంస్థలు, మన వైద్య రంగం… ఇలా ప్రతి ఒక్కరూ కొత్త సాంకేతిక మార్పుల వైపు వేగంగా కదులుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం విషయంలో దేశంలోని ప్రతి ఆవిష్కర్త కొత్త పరిస్థితులకు అనుగుణంగా నవ నిర్మాణం చేస్తున్నట్టు అనిపిస్తుంది.