ఆమీర్ – ప్రభాస్ లతో మల్టీస్టారర్ నా కల అంటున్న ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ దర్శకుడు

నవీన్ పొలిశెట్టి హీరో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్రంతో తెలుగు చిత్ర రంగంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ స్వరూప్ ఆర్జేఎస్. ప్ర‌స్తుతం ఈ కుర్ర ద‌ర్శ‌కుడు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల ఓ ఇంట‌ర్వ్యూలో తన అభిరుచులను పంచుకున్నాడు. తనకి మల్టీస్టారర్ చిత్రాలంటే  చాలా ఇష్టమని, టాలీవుడ్ సూపర్ స్టార్స్ బన్నీ-ఎన్టీఆర్ లతో జాన్ విక్ స్టైల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తీయాలని ఉందనే అభిలాషను వ్యక్తం చేశాడు. దానితోపాటు ఆమిర్ ఖాన్- ప్రభాస్ తో ఓ భారీ పాన్ ఇండియా మల్టీస్టారర్ ను తెరకెక్కించాలని ఉందని అదే తన డ్రీం ప్రాజెక్ట్ అని వెల్లడించాడు. తన ఆల్ టైమ్ ఫేవరెట్ మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలనుకుంటున్నా నంటూ చిరంజీవి పై తన అభిమానాన్ని బయట పెట్టారు. చూడాలి స్వరూప్ కోరిక‌లు బానే ఉన్నప్పటికీ ఎప్ప‌టికీ తీర‌తాయో చూడాలి.