దిశ’ బిల్లు వెనక్కి!

సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన కేంద్రం

సరిదిద్దే పనిలో నిమగ్నమైన అధికారులు

7న దిశ పీఎస్‌ను, యాప్‌ను ప్రారంభించనున్న సీఎం

అమరావతి, ‘‘ఆంధ్రప్రదేశ్‌ దిశ బిల్లు- 2019లో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దండి’’ అంటూ కేంద్ర ప్రభుత్వం వెనక్కు పంపింది. కేంద్రం నుంచి ఏపీ అసెంబ్లీకి వచ్చిన బిల్లు అక్కడ నుంచి ప్రభుత్వానికి చేరింది. బిల్లులో పొందుపరచిన 7వ షెడ్యూల్‌లో ఎంట్రీలు సరిగాలేవని, వాటిని సరిచేసి పంపాలని కేంద్రం సూచించినట్లు తెలిసింది. బిల్లులో కేంద్రం ఎత్తిచూపిన సాంకేతిక అంశాలను సరిచేసి మళ్లీ పంపేపనిలో అధికారులు నిమగ్నమయ్యారని సమాచారం.

‘దిశ’ పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటుపై సీఎస్‌ సమీక్ష సోమవారం సచివాలయంలో సంబంధిత శాఖాధికారులతో దిశ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సమీక్షించారు. రాజమండ్రిలో 7న దిశ పోలీ్‌సస్టేషన్‌, వన్‌స్టా్‌ప సెంటర్‌ను సీఎం జగన్‌ ప్రారంభిస్తారని చెప్పారు. పోలీ్‌సస్టేషన్‌ ప్రారంభోత్సవం తర్వాత సీఎం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. అక్కడ ‘దిశ’ ప్రత్యేక యాప్‌ను, స్టాండర్డ్‌ ఆపరేటివ్‌ ప్రొసీజర్‌నూ(ఎ్‌సఓపీ) ప్రారంభిస్తారన్నారు.