శ్రీకాళహస్తిలో నిరంతరాయంగా నిత్యావసర సరుకులు పంపిణీ: MLA మధుసూదన్

కరోనా లాక్ డౌన్ వలన ఉపాధి కోల్పోయిన శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రజలకు ఈరోజు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్ డౌన్ కారణంగా రెండు నెలల నుంచి వృత్తిరీత్యా ఉపాధి కోల్పోయిన వారికి బియ్యం కందిపప్పు నూనె ఉల్లిపాయలు మొదలైన నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో స్థానికులు మాట్లాడుతూ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి పేదల పక్షపాతి అని మొక్కవోని ధైర్యంతో ప్రజలకు సేవ చేస్తున్నారని కొనియాడారు. MLA నిండు మనస్సుతో అడగకపోయినా మాకు నిత్యావసర సరుకులు తన సొంత డబ్బుతో ఇచ్చారని వారికి ఎల్లప్పుడు రుణపడి ఉంటామని పట్టణ ప్రజలు తెలిపారు.