YSR జయంతి నాడే ఇళ్ల పట్టాలు పంపిణి..

మాజీ ముఖ్యమంత్రి YSR పుట్టినరోజున జులై 8న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేస్తామని AP CM జగన్మోహన్ సిద్ధమవుతున్నారు. APలో జులై 8న ఈ 27 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇళ్లపట్టాలు ఇవ్వడమే కాదు, ఉచితంగా ఇళ్లు కూడా కట్టిస్తాం. నామినేటెడ్‌ పనులు, నామినేటెడ్‌ పదవులు 50శాతం అక్క చెల్లెమ్మలకే ఇవ్వాలని గొప్ప చట్టం తీసుకు వచ్చాం. వక్ర బుద్ధితో అక్క చెల్లెమ్మల వైపు చూస్తే.. కఠినంగా శిక్షలు వేసేలా దిశ చట్టాన్ని తీసుకువచ్చాం. త్వరలో రాష్ట్రపతిగారు దీనికి ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నాం.