వైద్యులు మీరేలాంటి జాగ్రత్తలు??

ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ శాఖ వారు చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన అనంతరం కోవిడ్19 బారిపడిన వారికి చికిత్స అందించే వైద్యుల విషయంలో పలు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

1) కోవిడ్19 విధుల్లో ఉన్న వైద్యులకు గుర్తింపు కార్డు ఇవ్వాలి. గుర్తింపు కార్డులో అతని ఉద్యోగస్థాయి, కోవిడ్19 చికిత్స విధులలో చేరిన తేదీ, ఇన్స్యూరెన్స్ పాలసీ నంబరు తదితర వివరాలు పొందుపరచాలి/ ముద్రించాలి.

2) కోవిడ్19 చికిత్సకు నియమింపబడిన వైద్యులకు తగిన శిక్షణ మరియు మంచి నాణ్యతా ప్రమాణాలు గల స్వీయ రక్షణ పరికరాలు (PPE) ఇవ్వాలి.

3) కోవిడ్19 విధులలో ఉన్న వైద్యులకు ఆకర్షణీయమైన వేతనాలే కాకుండా వసతికి సంబంధించి మంచి సౌకర్యాలున్న హోటల్ లో వసతి, మంచి పోషక విలువలు గల ఆహారంతో పాటు హాస్పిటల్ వరకూ ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి.

పైన తెలిపిన ఆదేశాలను వైద్య ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమశాఖలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులు తక్షణం అమలు పరచవలసినదిగా ఆదేశించడమైంది.

State Nodal Officer, Team COVID-19 AP,
Command Control, Andhrapradesh.