వైద్యో నారాయణ హరి..మరవొద్దు.

వైద్యో నారాయణ హరి..మరవొద్దు.

కరోనా వ్యాధికి ఎలాంటి మందులు వాడాలి? డాక్టర్లను సంప్రదించాలా? వద్దా? ఖచ్చితంగా వైద్యో నారాయణ హరి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగాది నాటి వరకు 7 పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి.విదేశాల నుంచి రాష్ట్రానికి ఇప్పటివరకు 13,894 మంది వచ్చారు. వారిలో 11,421 మందికి పరీక్షలు నిర్వహించారు. అందులో 2,473 మందికి పరీక్షల్లో ఎటువంటి సమస్యలు లేకపోవడంతో ఇంటివద్దనే ఉంటున్నారు. 53 మంది హాస్పిటల్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్లకు దగ్గరగా ఉండేవారు, సంబంధీకులు మాత్రమే మాస్క్‌లు వాడాల్సి ఉంటుంది.
హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వినియోగిస్తే కరోనా సోకదనే కథనాల్లో వాస్తవం లేదని ముఖ్యమంత్రి అదనపు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పీవీ రమేష్‌, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి డాక్టర్‌ ఎం.హరికృష్ణతో కలిసి సచివాలయంలో
మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. కరోనా సోకకుండా ఉన్న సాధారణ వ్యక్తులెవ్వరూ ఈ మందును వినియోగించరాదు కాదని వాడితే మాత్రం
దుష్పరిణామాలకు ఎదురవుతాయని హెచ్చరించింది.
కరోనా వైరస్‌ సోకిన వారికి మాత్రమే ఈ మందును వాడాలని అఖిల భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) స్పష్టం చేసింది. కరోనా సోకిన రోగులకు, సేవలందిస్తున్న వైద్యులకు, సిబ్బందికి ముందు జాగ్రత్తగా మాత్రమే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వినియోగిస్తున్నారు. ఇది పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో జరుగుతోంది. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తులు, ఆకాజ్ వాళ్ళతో ఉన్నందుకు వ్యాధి లక్షణాలు కనిపిస్తే అది కూడా పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఈ మందు వినియోగిస్తోన్న విషయాన్ని ప్రజలందరూ గమనించాలి.