రేపే చైనాకు ఏయిర్ ఇండియా విమానం

కోవిడ్-19పై భారత్ చేస్తున్న పోరాటానికి దేశీయ కార్గో విమానాలు బలం చేకూరుస్తున్నాయి. గత పది రోజులుగా దేశవ్యాప్తంగా వివిధ వైద్య అవసరాలైన టెస్టింగ్ కిట్లు, మాస్కులు, చేతి గ్లోవ్స్, ఇంకా అనేక వస్తువుల చేరవేస్తున్నాయి. క్షేత్ర స్థాయిలోను, విధాన పరంగాను నిర్ణయాలు తీసుకోవడం, నిర్వహణ చేపట్టడంలో 24X7 తోడ్పడుతున్నాయి.

ఎయిర్ ఇండియా, భారత వైమానిక దళం కలిసి సంయుక్తంగా లడాఖ్, దిమాపూర్, ఇంఫాల్, గాంగ్టక్, గోవాహటి, బాగ్డోగ్ర, చెన్నై, పోర్ట్ బ్లెయిర్ కి సరుకు రవాణా చేశాయి. అంతర్జాతీయంగా షాంఘై ఢిల్లీ మధ్య విమానయానాం నేరుగా అనుసంధానం అయింది. ఈ ఏప్రిల్ 5న ఎయిర్ ఇండియా మొదటి కార్గో విమానం వెళ్తుంది. కీలకమైన వైద్య పరికరాలను రవాణా చేయడం కోసం ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాలను చైనాకు ఒక షెడ్యూల్ ప్రకారం నడుపుతుంది.

కోవిడ్ -19 కు వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విధాన స్థాయిలోను, క్షేత్ర స్థాయిలో నిరంతర ప్రయత్నాలలో నిమగ్నమై ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపిణీ చేసిన సరుకులో కోవిడ్ -19 సంబంధిత కారకాలు, ఎంజైములు, వైద్య పరికరాలు, రోగనిర్ధారణ పరీక్షా వస్తు సామగ్రి ఉన్నాయి. అలాగే వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇ), మాస్కులు, చేతి తొడుగులు (గ్లోవ్స్), హెచ్ఎల్ఎల్ ఇతర ఉపకరణాలు రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కోరిన సరుకు, పోస్టల్ కట్టలు చేరవేయబడ్డాయి.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, ఐసిఎంఆర్ కేంద్రాలకు అవసరమైన వైద్య సామాగ్రిని పంపిణీ చేయడంతో, ఈ క్రింది ప్రయత్నాలు నెరవేరాయి. కారకాలు/మెడికల్ కిట్ల పంపిణీ వల్ల రోగులను సకాలంలో పరీక్షించటానికి వీలు కల్పించింది. తద్వారా తదుపరి చర్యలు తీసుకోగలిగారు. డాక్టర్లు అలాగే ఇతర వ్యక్తులు ఈ విమానాల ద్వారా సకాలంలో పంపిణీ అయిన మాస్కులు, చేతి తొడుగులను ఉపయోగించుకోగలిగారు, తమకు తాముగా రక్షణ చర్యలు చేపట్టగలిగారు. ఈశాన్య రాష్ట్రాల మారుమూల ప్రాంతాలకు సైతం వైద్య సామాగ్రిని చేరవేయగలిగారు. తన సేవల ద్వారా దేశంలోని వివిధ దూర ప్రాంతాలకు కావలసిన అవసరాలను తీర్చడంతో పాటు వనరులను మెరుగ్గా వినియోగించుకునే ప్రయత్నం జరిగింది.

ప్రైవేట్ ఆపరేటర్లు-దేశీయ కార్గో ఆపరేటర్లు: బ్లూడార్ట్, స్పైస్‌జెట్, ఇండిగో వ్యాపార పరంగా కార్గో విమానాలను నడుపుతున్నాయి. 2,07,947 కిలోమీటర్ల దూరాన్ని, 1,213.64 టన్నుల సరుకును రవాణా చేసిన స్పైస్‌జెట్ మార్చి 24 నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు 153 కార్గో విమానాలను నడిపింది. వీటిలో 44 అంతర్జాతీయ కార్గో విమానాలు. బ్లూ డార్ట్ 45 దేశీయ కార్గో విమానాలను మార్చి 25 నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు 45,783 కిలోమీటర్ల దూరం నడిపి 702.43 టన్నుల సరుకును రవాణా చేసింది. ఇండిగో 03.4.2020 న 4,871 కిలోమీటర్ల దూరాన్ని 5 కార్గో విమానాలను నడిపి 2.33 టన్నుల సరుకును రవాణా చేసింది.