ఆవిర్భావదినోత్సవం రక్తదానం. KTR

TRS పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు అందరు కూడా ఎక్కడి వారు అక్కడే తమ ఇళ్లపై టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలి. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రోజుల పాటు సామాజిక దూరాన్ని పాటిస్తూ రక్తదాన కార్యక్రమాన్ని వారం రోజులపాటు కొనసాగించాలి. ఈరోజు స్వయంగా రక్తదానం చేసిన కేటీఆర్ ఈ కష్టకాలంలో చుట్టుపక్కల అవసరం ఉన్నవారికి ఆదుకోవాలన్నారు. 20 సంవత్సరాల పాటు ప్రజల్లో మమేకమైన అనుభవంతో మరోసారి ప్రజల సేవకు పునరంకితం అవుదామన్నారు.

20 సంవత్సరాల పార్టీ ప్రస్థానం ఒక్కమాటలో చెప్పాలంటే ఆనాటి జలదృశ్యం నుంచి ఈనాటి సుజల దృశ్యం వరకు అని చెప్పవచ్చు. దేశ రాజకీయాల పైన టిఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా ప్రభావం చూపించ లేక పోయినప్పటికీ తన పథకాలు కార్యక్రమాల ద్వారా పరోక్షంగా ప్రభావం చూపిస్తున్నది. తమ ప్రభుత్వం కార్యక్రమాలు పథకాలను కేంద్ర ప్రభుత్వం మరియు వివిధ రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసిన మంత్రి కేటీఆర్.

టిఆర్ఎస్ పార్టీ ముద్ర భారతదేశ రాజకీయ యవనికపై స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం సింగిల్ పాయింట్ ఎజెండా తో తన గమ్యాన్ని ముద్దాడిన పార్టీ దేశంలో టిఆర్ఎస్ పార్టీ ఒకటే. ఉద్యమకారుడిగా మరియు పరిపాలన అధ్యక్షుడిగా ఏకకాలంలో పేరు తెచ్చుకో కలగడం కేవలం కేసీఆర్ గారికే చెల్లింది అని అరుణ్జైట్లీ నాతో స్వయంగా చెప్పారు. 20వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రజలతో పాటు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎప్పటికప్పుడు స్పూర్తినిచ్చిన ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగర్రావు ఇలాంటి ఎందరో మహానుభావులను గుర్తుంచుకుంటాం. దేశంలో రెండు దశాబ్దాలపాటు ప్రజాదరణ పొందుతూ ప్రజల్లో నిలబడిన పార్టీలు వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు టిఆర్ఎస్ పార్టీ ఒకటి ఉండటం సంతోషకరం. 60 లక్షల మంది కార్యకర్తలతో టిఆర్ఎస్ పార్టీ ఈనాడు అజయ శక్తిగా నిలిచింది. ప్రపంచంలోనే అతి పెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మూడు సంవత్సరాలు పూర్తి చేసిన ఘనత టిఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది. తెలంగాణలో హరితవిప్లవం తో పాటు క్షీర విప్లవం, పింక్ విప్లవం (మాంసం) నీలి విప్లవం (చేపలు), శ్వేత విప్లవం (పాలు) జల విప్లవం తెలంగాణలో ఆవిష్కృతమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇన్ని సంవత్సరాలుగా అవహేళన చేయబడ్డ భాష, యాస,సంస్కృతి, సాంప్రదాయాలు ఈరోజు తమదైన గౌరవాన్ని దక్కించుకున్నాయి.

ప్రస్తుతం కరోనా ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి గారి మార్గ దర్శనం చూసిన తర్వాత ఆయన నాయకత్వం మరో పది, పదిహేను సంవత్సరాలపాటు కొనసాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అందులో నేను ఒకడిని. ప్రస్తుత సంక్షోభ సమయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ప్రెస్ మీట్ కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొని ఉన్నది. ఇది ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలకి ఆయన మీద ఉన్న విశ్వాసానికి నిదర్శనం. టిఆర్ఎస్ పార్టీ ఈరోజు ఇన్ని విజయాలు సాధించి ఈ స్థితిలో ఉన్నదంటే దానికి కారణం కచ్చితంగా కెసిఆర్ నాయకత్వం, ఆయన ఇచ్చిన స్ఫూర్తినే కారణం. ప్రజలు ప్రతిపక్షాలను వద్దు అనుకుంటున్నారు అందుకే ప్రతి ఎన్నికల్లో 100% విజయాలు టిఆర్ఎస్ పార్టీ కట్టబెడుతూ వస్తున్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఆత్మ విమర్శ చేసుకోవాలి. తెలంగాణ విభజన సందర్భంగా ద్వేషించిన లక్షలాదిమంది ఈరోజు కెసిఆర్ గారిని అత్యధికంగా అభిమానిస్తున్నారు. విభజన వికాసం కోసం అన్న విషయాన్ని వారు ఈ రోజు సంపూర్ణంగా విశ్వసిస్తున్నారు

ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఉద్యమం నడిపిన తీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలిస్తున్న తీరుపైన భవిష్యత్తులో పెద్ద ఎత్తున అధ్యయనాలు జరుగుతాయనడంలో అతిశయోక్తి లేదు. ఎవరి మద్దతు లేకుండా అన్ని స్థాయిల్లో జరిగిన ఎన్నికల్లో ఏకపక్షంగా గెలిచిన పార్టీ దేశంలో బహుశా టిఆర్ఎస్ పార్టీ ఒకటే. ప్రస్తుతం అన్ని జిల్లాల్లోనూ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు సిద్ధమయ్యాయి. ప్రస్తుత సంక్షోభం ముగిసిన తర్వాత వాటి ప్రారంభోత్సవ లతోపాటు కార్యకర్తల శిక్షణ కార్యక్రమాల పైన కూడా ఆలోచన చేస్తామని KTR అన్నారు.