తెలంగాణ రాష్ట్రంలో కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి 3 కోట్ల రూపాయలను మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట తారక రామారావుకు వివిధ స్వచ్చంద సంస్థల నిర్వాహకులు, వ్యాపారులు ప్రగతి భవనులో అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నివారణ కోసం సహాయ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధికి మిత్రా ఎనర్జీ 2కోట్లు, గంగవరం పోర్టు మూడు కోట్లు విరాళం ఇచ్చింది. అంతేకాకుండా గంగవరం పోర్టులో షేర్ హోల్డర్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 16.25 కోట్లు ఇంటర్మ్ డివిడెండ్ కూడా రావడం జరిగింది.
అలాగే బీజేపీ విజయవాడ పార్లమెంటరీ ఇంచార్జీ కిలారు దిలీప్ లక్ష రూపాయాల విరాళాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి చెక్కు రూపంలో అందజేశారు. కడప జిల్లా సింహద్రిపురం మండలం Y.కొత్తపల్లి గ్రామంలో నిరుపేదలకు బొమ్మరెడ్డి నాగిరెడ్డి ఫౌండేషన్, కిలారు దిలీప్ సంయుక్తంగా బొరుగులు, ఉప్మా రవ్వ, ఆయిల్ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేశారు.