కరోనా నివారణకు నిద్రపోకుండా పోరాడాల్సిందే – AP సీఎం జగన్

APలో కోవిడ్‌19 నివారణా చర్యలు, ప్రభావిత రంగాల్లో పరిస్థితులపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. గుజరాత్‌ నుంచి తెలుగు మత్స్యకారులను తిరిగి స్వస్థలాలకు తీసుకు వస్తున్న అంశంపై అధికారులనుంచి వివరాలు కోరిన సీఎం రవాణా ఖర్చులు, భోజనం, దారిఖర్చులు అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని వెల్లడించిన అధికారులు 4,065 మందికిపైగా స్వస్థలాలకు బయల్దేరారన్నారు. మత్స్యకారులు తిరిగి వచ్చిన తర్వాత వారికి రూ.2వేల చొప్పున ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 73 కేసులు నమోదయ్యాయని గుంటూరులో నమోదైన 29 కేసుల్లో 27 కేసులు నర్సరావుపేట నుంచే వచ్చాయని, అక్కడ పెద్ద ఎత్తున కంటైన్మెంట్‌ చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు తెలిపారు. రాష్ట్రంలో పాజిటివిటీ శాతం 1.51శాతం అయితే, దేశవ్యాప్తంగా పాజిటివిటీ కేసులు 3.84శాతంగా ఉందని, గడచిన 24 గంటల్లో 7,727 పరీక్షలు చేశామని, ఇందులో 70శాతం వరకూ పరీక్షలు రెడ్‌జోన్లలోనే చేసిన విషయం, ఇప్పటివరకూ 88,061 పరీక్షలు చేశామని, ప్రతి మిలియన్‌కు 1649 పరీక్షలు వివరాలను సీఎంకు వివరించారు.

క్లస్టర్ల వారీగా కూడా వెరీయాక్టివ్, యాక్టివ్, డార్మంట్‌ క్లస్టర్లు గుర్తించామని, గడచిన 5రోజుల్లో కేసులు నమోదైన క్లస్టర్లను వెరీ యాక్టివ్‌ క్లస్టర్లుగా పరిగణిస్తున్నామన్న అధికారులు. వెరీ యాక్టివ్‌ క్లస్టర్లు 76, 5 నుంచి 14 రోజులుగా కేసులు లేని యాక్టివ్‌ క్లస్టర్లు 55 అలాగే 14 నుంచి 28 రోజులుగా కేసులులేని డార్మంట్‌ క్లస్టర్లు 73 అలాగే 28 రోజులనుంచి కూడా కేసులు లేని క్లస్టర్లు 13 మరింత ఫోకస్‌గా పనిచేయడం కోసం ఈ విశ్లేషణను కలెక్టర్లకు అందిస్తున్నారు.

శ్రీకాకుళం రిమ్స్‌లో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో ట్రయల్‌ టెస్టులు ప్రారంభం అయ్యాయని, ఒంగోలులో ల్యాబ్‌ ఏర్పాటు చర్యలు కూడా ప్రారంభమయ్యాయని, నెల్లూరులో కూడా ల్యాబ్‌ ఏర్పాటు ముమ్మరంగా సాగుతున్నాయని, శనివారం నాటికి ఈ మూడు కొత్త ల్యాబ్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇప్పటివరకూ 8 జిల్లాల్లో 9 ల్యాబ్‌లు పని చేస్తున్నాయని, ఇవికాక ప్రతి ఏరియా ఆస్పత్రి, టీచింగ్‌ ఆస్పత్రుల్లో సుమారు 50 చోట్ల ట్రూనాట్‌ కిట్లు ఉన్నాయి. డీఆర్డీఓతో మాట్లాడి మొబైల్‌ ల్యాబ్‌ను కూడా తయారు చేయిస్తున్నామన్నారు.

టెలిమెడిసిన్‌ పరీక్షపై సీఎం నిశిత పరీక్ష

ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం టెలిమెడిసిన్‌కు కాల్‌చేసిన వారికి అదేరోజు మందులు అందించే ప్రయత్నాలు చేస్తున్నామని, టెలిమెడిసిన్‌ వ్యవస్థ మరింత సమర్థవంతంగా అమలు చేసేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నామని, మందులు వెళ్లాయా? లేదా? అన్నదానిపై పూర్తిగా అధికారుల పర్యవేక్షణ ఉంటుందని, జిల్లాకు ఏర్పాటుచేస్తున్న ముగ్గురు జేసీల్లో ఒకరికి పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించాలన్న సీఎం టెలిమెడిసిన్‌కు సంబంధించి సరైన ఎస్‌ఓపీని రూపొందించు కోవాలని, పూర్తిస్థాయిలో దృష్టిపెట్టి టెలి మెడిసన్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కుటుంబ సర్వేలో గుర్తించిన వారికి పరీక్షలపై ఇప్పటివరకూ 12,247 పరీక్షలు చేశామని, మిగిలిన వారికి కూడా వీలైనంత త్వరగా పరీక్షలు చేయాలని, మూడు రోజుల్లో అధికారులు పూర్తి చేస్తామన్నారు.

వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు గత ఏడాదితో పోలిస్తే ఏ పంటలోనైనా రైతుల వద్దనుంచి ఎక్కువే కొనుగోలు చేశామని, గతంలో ప్రభుత్వం ఎప్పుడూ కొనుగోలు చేయని మొక్కజొన్నను కూడా సేకరిస్తున్నామని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా మార్కెట్లో ధరల స్థిరీకరణ పరిస్థితులు చోటుచేసుకున్నాయన్న అధికారులు ఈ క్రాపింగ్, ఫాంగేట్, టోకెన్ల పద్ధతిద్వారా కొనుగోలు తదితర చర్యలతో ముందుకు సాగుతున్నాయన్న అధికారులు అరటి, టొమాటో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాట్లపై దృష్టిపెట్టాలని, చీనీ పంటకు ధర వచ్చేలా చూడాలన్న సీఎం గాలివాన కారణంగా పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వెంటనే ఎన్యుమరేషన్‌ చేసి రైతులను ఆదుకోవాలని సీఎం ఆదేశం
ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుని వాటిద్వారా కూరగాయలను పంపిస్తున్నామని, మంచి ఆదరణ లభిస్తోందని వెల్లడించారు.

ఈ సమీక్ష సమావేశం క్యాంపు కార్యాలయంలో జరగగా డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ తదితర అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివరాలు అందించిన వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి పాల్గొన్నారు.