కరోనా యుద్ధంలో పోరాట యోధుల్లారా

దేశంలో కోవిడ్ -19 మీద పోరాటం చేస్తున్న మొదటి వరుస కార్యకర్తలకు ఓ డిజిటల్ అభ్యాస వేదికను ప్రారంభించినట్లు (https://igot.gov.in) పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం ప్రకటించింది. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో తదుపరి దశలకు తగిన విధంగా సిద్ధం చేసేందుకు శిక్షణ ఇస్తోంది. అనంతరం రెండో వరుస కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం ద్వారా, తాజా పరిస్థితులను ఎదుర్కొనే దిశగా భారతదేశాన్ని సిద్ధం చేయనుంది.

వైద్యులు, నర్సులు, పారామెడికల్, పరిశుభ్రత కార్మికులు, సాంకేతిక నిపుణులు, సహాయక నర్సింగ్ స్టాఫ్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, పోలీసులు, వివిధ పోలీసు సంస్థలు, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్.సి.సి), నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్.వై.కె.ఎస్), నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్.ఎస్.ఎస్), ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐ.ఆర్.సి.ఎస్), భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ (బి.ఎస్.జి) కార్యకర్తలకు ఈ శిక్షణ అందుబాటులో ఉంటుంది.

ఈ ప్లాట్ ఫాం ప్రతి అభ్యాసకుడికి తన పని ప్రదేశంలో లేదా ఇంటి వద్ద మరియు తనకు నచ్చిన ఏదైనా పరికరానికి క్యూరేటెడ్, రోల్ – స్పెసిఫిక్ కంటెంట్ ను అందిస్తుంది. ఐ గాట్ ప్లాట్ ఫాం జనాభా స్థాయికి అనుగుణంగా రూపొందించబడింది. రాబోయే వారాల్లో సుమారు 1.50 కోట్ల మంది కార్మికుల మరియు వాలంటీర్లకు శిక్షణ అందిస్తుంది. బేగోక్స్ ఆఫ్ కోవిడ్, ఐసియు కేర్ అండ్ వెంటిలేషన్ మేనేజ్ మెంట్, క్లినికల్ మేనేజ్ మెంట్, పి.పి.ఈ. ద్వారా ఇన్ఫెక్షన్ నివారణ, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, దిగ్బంధం మరియు ఐసోలేషన్, ప్రయోగశాల నమూనా సేకరణ మరియు పరీక్ష, నిర్వహణ వంటి అంశాలపై ఐగోట్ లో తొమ్మిది (9) కోర్సులను ప్రారంభించింది.

అనుకూలీకరించిన విధానం ద్వారా కోవిడ్ యోధులు ఈ కోర్సు నుంచి క్లిష్టమైన అంశాల గురించి తెలుసుకోవచ్చు. ప్రస్తుత మరియు రానున్న పరిస్థితులకు ప్రతిస్పందించవ్చు. తమను తాము నిజ సమయ పద్ధతిలో నవీనీకరించడం ద్వారా ఎప్పుడైనా ఎక్కడైనా నేర్చుకోవడానికి, కొత్త సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవడానికి ఈ వేదిక బాగా ఉపయోగపడుతుంది. కంప్యూటర్ మరియు మొబైల్ లో సులభంగా ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది. తద్వారా ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది.

గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన విధంగా దేశానికి సేవ చేసే వారి సంక్షేమాన్ని చూసుకోండి అనే భావనను ఈ వేదిక ప్రతిబింబిస్తుంది. తొలి వరుసలో ఉండే కార్యకర్తలందరికీ ఈ నవీనీకరించబడిన విజ్ఞానం ఇబ్బందికర పరిస్థితుల్లో ఓ గొప్ప ఆయుధం. కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా చేసే యుద్ధంలో విజయానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది.

ప్రస్తుతం ఐ గేట్ తాజా వెర్షన్ ఈ లింక్ (https://igot.gov.in) లో లభ్యమౌతోంది. గూగుల్ క్రోమ్ మరియు మోజిల్లా ఫైర్ ఫాక్స్ లో వినియోగానికి అందుబాటులో ఉంది. త్వరలో అన్ని బ్రౌజర్ లకు ఉపయోగపడే వెర్షన్ అందుబాటులోకి రానుంది.