తెలంగాణలో డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రారంభం

తెలంగాణలో డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రారంభం

మండలంలోని పామాపురంలో సోమవారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభిచనున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎం ఎల్ ఏ ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి నేతృత్వంలో జరిగే సభలో అధికార, అనధికార ప్రముఖులు పాల్గొననున్నారు. సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోన్న తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది . పామాపురంలోని ఇళ్ల నిర్మణాన్ని టెండర్ ద్వారా దక్కించుకున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ 56 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. వాటిని సోమవారం లబ్ధిదారులకు అందించనున్నారు.ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నాణ్యతలో రాజీ పడకుండా నిర్మించింది. ఈ కార్యక్రమమంలో రోడ్లు మరియు భవనాలు ,గృహనిర్మాణ శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,క్రీడలు యువజన సర్వీసుల శాఖా మంత్రి డాక్టర్ వి . శ్రీనివాస్ గౌడ్ ,శాసన మండలి విప్ కె. దామోదర్ రెడ్డి,ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి ,ఎంఎల్సీలు కె .నారాయణరెడ్డి ,సురభి వాణీదేవి,కాటేపల్లి జనార్దన్ రెడ్డి,వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా,సూపరింటెండింగ్ ఇంజినీర్ జె . శివ కుమార్ ,మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రెసిడెంట్ ప్రాజెక్ట్స్ కె.గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు .