రక్షణకు DRDO బయోసూట్

కరోనా మహామ్మారిని అరికట్టేందుకు ఆహార్నిశలు కృషి చేస్తోన్న వైద్యులు, పోలీసులు సంరక్షణకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) బయోసూట్‌ను తయారు చేసింది.

పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ (PPE) సూట్‌ను DRDO శాస్త్రవేత్తలు టెక్స్‌టైల్, కోటింగ్, నానోటెక్నాలజీ సాంకేతికతలను పరిశీలించి సూట్ తయారీ ఆవశ్యకతను గుర్తించారు. భారతదేశంలో అత్యవసరసేవలు అందిస్తోన్న ముఖ్యంగా ICUల్లో కరోనా పాజిటివ్ కేసులకు ట్రీట్ మెంట్ చేస్తోన్న వైద్యులు, వైద్య సిబ్బంది, మార్చురీల్లో ఉంటున్న వ్యక్తులు, అత్యవసర సేవలు అందిస్తోన్న పోలీసులకు ఈ బయోసూట్ చాలా ఉపయోగపడుతుంది. DRDO వీలైనంత ఎక్కువగా ఈ వస్తువు తయారీ చేయాలనీ, ఇప్పుడైతే రోజుకు 7 వేల సూట్లను తయారుచేసే సామర్థ్యం కలిగి ఉన్నామని తెలిపింది.